BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు విడుదల

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ప్రతీ రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 5.51 లక్షల మంది అప్లై చేసుకున్నారు.

New Update
TSPSC Group-1: ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ.. గ్రూప్-1 కు రికార్డు సంఖ్యలో అప్లికేషన్లు!

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ను టీజీస్పీఎస్సీ (TGPSC) కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో ఈ పరీక్ష ఉంటుంది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుంది. తొలి రోజు అంటే డిసెంబర్ 15న.. పేపర్-1, పేపర్-2 పరీక్షలను, మరుసటి రోజు డిసెంబర్ 16న పేపర్-3, 4 పరీక్షలను నిర్వహించనున్నట్లు టీజీస్పీఎస్సీ (TGPSC) వెబ్ నోట్లో పేర్కొంది.
ఇతర వివరాలు: TG DSC : టీచర్ నియామకాలపై కీలక అప్‌ డేట్.. ఒక్కోపోస్టుకు ఎంత మందిని పిలుస్తారంటే!

publive-image

మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్ 29న టీజీస్పీఎస్సీ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5.51 లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుకున్నారు. అయితే.. పేపర్ లీకేజీ, ఎన్నికలు తదితర కారణాలతో ఈ పరీక్ష వాయిదా పడుతూ వస్తోంది. అనంతరం ఈ నెల 7,8 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది. అయితే.. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ పరీక్షల తేదీలను విడుదల చేసింది టీజీస్పీఎస్సీ. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. వచ్చే ఏడాది మే, అక్టోబర్ నెలల్లో రెండు గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఆ నాటిఫికేషన్ల విడుదల నాటికి 2022 నోటిఫికేషన్ కు సంబంధించిన గ్రూప్-2 నియామక ప్రక్రియను పూర్తి చేయాలన్నది పబ్లిక్ సర్వీస్, ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: APPSC : Group-1: గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్!


Advertisment
Advertisment
తాజా కథనాలు