BIG BREAKING: డబ్బుల కట్టడిలో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసు అధికారులు ఔట్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాదవ్‌, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పోలీస్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.

New Update
BIG BREAKING: డబ్బుల కట్టడిలో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసు అధికారులు ఔట్

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులపై హైదరాబాద్ సీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ లిస్టులో చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాదవ్‌, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పోలీస్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. డబ్బుల కట్టడిలో పక్షపాతం చూపారని వేటు వేసినట్లు ఈసీ పేర్కొంది.

publive-image

నిన్న రాత్రి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్ మెంట్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు ముఠా జయ సింహా పట్టుబడ్డారు. అయితే ఈ కేసులో ముఠా జయ సింహాను తప్పించి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు. విధుల్లో నిర్లక్ష్యం వహించి , ఎమ్మెల్యే కొడుకుకు సహకరించినందుకు సిఐ , ఏసీపీ , డీసీపీ లను సస్పెండ్ హైదరాబాద్ సీపీ సందీప్ స్యాండిల్య చేశారు.

ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ!

Advertisment
తాజా కథనాలు