BIG BREAKING: రుణమాఫీ నిధులు విడుదల

తెలంగాణలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. వారి రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో రూ.లక్షలోపు రుణాలు ఉన్న 11 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.

New Update
BIG BREAKING: రుణమాఫీ నిధులు విడుదల

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. రూ.లక్ష వరకు రుణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేసింది. లక్ష లోపు రుణాల మాఫీ కోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 11 లక్షల మంది రైతులకు లక్షలోపు రుణాలున్నాయి. దీంతో వీరందరి రుణాలు ఇప్పుడు మాఫీ కానున్నాయి. ఆగస్టు మొదటి వారంలో రూ.లక్షన్నర లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఆ తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేయనుంది. ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌ చిత్ర పటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు.

గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరో వైపు రుణ మాఫీ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన గౌడ్ లైన్స్ పై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్‌ సర్కార్‌కు పలు ప్రశ్నలు సంధించారు. లక్షలోపు రుణాలు ఉన్న రైతులు రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మంది ఉంటే 11 లక్షల మంది రైతులను మాత్రమే ఎలా ఎంపిక చేశారు? అని ప్రశ్నించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాల మాఫీ కోసం రూ.16,144 కోట్లు ఖర్చు చేసి 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు.

2014లో మొదటిసారి రూ. 1 లక్ష లోపు రుణ మాఫీ చేయడానికి అయిన సొమ్ము సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో రూ. 16,000 కోట్లు అని అన్నారు. 2018 తరువాత లక్ష లోపు రుణమాఫీ చేయడానికి కావాల్సిన నిధులు రూ.19,198 కోట్లు అవసరం అవుతాయని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేయగా.. రూ. 12,000 కోట్లు రైతుల ఖాతాల్లో అప్పట్లో జమ చేసింది అని స్వయంగా రేవంత్ రెడ్డే స్వయంగా తన నోటితో చెప్పారన్నారు. ఇప్పుడు లక్ష లోపు రుణాలకు రూ. 7 వేల కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. నిధులు ఇంతగా ఎందుకు తగ్గాయనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు కేటీఆర్.

Advertisment
Advertisment
తాజా కథనాలు