బీజేపీ ఫైనల్ లిస్ట్ లో (BJP Final List) ట్విస్ట్ చోటు చేసుకుంది. మళ్లీ అభ్యర్థులను మార్చింది కమలం పార్టీ. బెల్లంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి కొనసాగుతారాని పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో శ్రీదేవి పేరును ప్రకటించగా.. ఈ రోజు ఉదయం ఆమె స్థానంలో హేమాజీ పేరును ప్రకటించారు. ఇంకా.. ఈ రోజు ఉదయమే ప్రకటించిన అలంపూర్ అభ్యర్థిని మార్చింది బీజేపీ. మారెమ్మ స్థానంలో అభ్యర్థిగా రాజగోపాల్ ను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Congress Final List: కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. ఐదుగురు అభ్యర్థులు వీరే..
ఉదయం ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన 90 నిమిషాల్లోనే మళ్లీ అభ్యర్థులను మార్చడానికి కారణం ఏమై ఉంటుందనే అంశంపై బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. హైకమాండ్ కు రాష్ట్ర నాయకత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
ఇది కూడా చదవండి: Big Breaking: టికెట్ రాకపోవడంపై అద్దంకి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ!
కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేయగా.. బీజేపీ 16 స్థానాలతో ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. బీజేపీలో ఇంకా వేములవాడ వివాదం ఆగలేదు. ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే పార్టీ అభ్యర్థి తుల ఉమకు ఇబ్బంది తప్పదన్న చర్చ సాగుతోంది.