Terrorist Attack: అమర్నాథ్ యాత్రలో (Amarnath Yatra) విధ్వంసానికి ఐఎస్‌ఐ కుట్ర చేసినట్లు భారత రక్షణ విభాగం గుర్తించింది. బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి పన్నాగం పన్నినట్టు తెలిపింది. హిందు (Hindus), బీజేపీ (BJP) నేతలే టార్గెట్ గా విధ్వంసానికి ఐఎస్‌ఐ (ISI) ప్లాన్ చేసినట్లు చెప్పారు. పంజాబ్ లోని గ్యాంగ్ స్టార్లు, ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. గత నెల పఠాన్‌కోట్ పరిసరాల్లో ఉగ్రవాద కదలికలను గుర్తించింది ఇండియన్ ఆర్మీ. జమ్మూలో ఏడుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనక పాక్ కుట్ర ఉందని భావిస్తోంది ఇండియన్ ఆర్మీ.
Also Read: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి!
పాకిస్తాన్ కుట్రకు జవాన్లు చెక్..
నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలపై పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) దాడిని భారత ఆర్మీ దళాలు భగ్నం చేశాయి. దాడిలో పాల్గొన్న BAT బృందంలో టెర్రరిస్టు సంస్థలతో సన్నిహితంగా పనిచేసే వారి SSG కమాండోలతో సహా సాధారణ పాకిస్తాన్ ఆర్మీ దళాలు ఉన్నట్లు రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Also Read: ఉద్యోగులకు శుభవార్త…ఆగస్ట్ 15 తరువాత డీఏ ప్రకటన!