చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై (Chandrababu Health) ఏసీబీ కోర్టులో (ACB Court) ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: AP Capital Issue: రాజధాని విశాఖకు తరలింపు తుగ్లక్ చర్య.. రాయలసీమకు తీవ్ర నష్టం: తులసిరెడ్డి
చంద్రబాబు నాయుడు ఆరోగ్య విషయంలో జైళ్ల శాఖ డీజీని, వైద్యులను భయపెట్టి బెదిరించి తప్పుడు రిపోర్ట్ ఇప్పిస్తున్నారని టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వాస్తవాలను బయటకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Ap CM Jagan:త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతా-ఏపీ సీఎం జగన్
చంద్రబాబు ఆరోగ్య విషయంలో ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అందుకే ఇలా చేస్తున్నారన్న అనుమానాన్ని విజయ్ వ్యక్తం చేశారు. ఇంకా.. జిల్లా శాఖ అధికారుల తీరు, వైద్యుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఇదంతా జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు చింతకాయల విజయ్.
ఇదిలా ఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. చంద్రబాబు అరెస్ట్ దాటి నెల రోజులు దాటినా.. ఇంకా ఏ కోర్టులోనూ ఉపశమనం లభించకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.