Actor Shivaji: ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ గా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న యాక్టర్ శివాజీ(Shivaji) తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. గత కొంత కాలంగా ప్రేక్షకులకు కాస్త దూరమైన శివాజీ.. ఈ షోతో మరో సారి కమ్ బ్యాక్ ఇచ్చారు. బిగ్ బాస్ తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే తాజాగా.. శివాజీ బిగ్ బాస్ కు ముందు నటించిన వెబ్ సీరీస్ కు(Web series) సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనౌన్స్ చేశారు.
శివాజీ నటించిన #90’s - మిడిల్ క్లాస్ బియోపిక్ (#90’s - A Middle Class Biopic) జనవరి 5 న ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలిపారు. 90’s ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో యాక్టర్ శివాజీ, వాసుకీ జంటగా నటించారు. ఇటీవలే జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ.. ఈ సీరీస్ ఆహ్లదంగా, ఉల్లాసంగా ఉంటుందని.. #90’s కిడ్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండబోతుందని తెలిపారు. అలాగే సినిమాలో తాను గణితం టీచర్ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది.. తన స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయన్నారు. 90’s జనరేషన్ కిడ్స్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఉల్లాసకరమైన కామెడీతో క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో మౌళి, వసంతిక, రోహన్, స్నేహాల్ కమత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సీరీస్ ట్రైలర్ కూడా కామెడీ సీన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆదిత్య హాసన్ ఈ సీరీస్ కు దర్శకత్వం వహించారు. నవీన్ మేడరామ్, రాజశేఖర్ బొబ్బిలి సంయుక్తంగా నిర్మించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
"🎬 #90s - A Middle Class Biopic 🏡 Travel with Mr. Shekhar and his family for a comforting escape to your 90s memories. This Jan 5, watch #90s with your family! 🍿"
.@mouli_talks @MNOPRODUCTIONS @az_dop @Gnaadikudikar @vinod_nagula @sharvin1995 @Saikishore040… pic.twitter.com/L1tIYOALBD— ETV Win (@etvwin) December 30, 2023
Also Read: Pushpa 2: ‘ఈ సారి రూల్ పుష్పదే’.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్