Actor Shivaji: బిగ్ బాస్ ఫేమ్ యాక్టర్ శివాజీ లేటెస్ట్ వెబ్ సీరీస్ .. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరయ్యారు యాక్టర్ శివాజీ. తాజాగా శివాజీ నటించిన '#90’s' వెబ్ సీరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 90’s జనరేషన్ కిడ్స్ కథాంశంతో రూపొందిన ఈ సీరీస్ జనవరి 5 న ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలిపారు.

New Update
Actor Shivaji: బిగ్ బాస్ ఫేమ్ యాక్టర్  శివాజీ లేటెస్ట్ వెబ్ సీరీస్ .. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Actor Shivaji: ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ గా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న యాక్టర్ శివాజీ(Shivaji) తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. గత కొంత కాలంగా ప్రేక్షకులకు కాస్త దూరమైన శివాజీ.. ఈ షోతో మరో సారి కమ్ బ్యాక్ ఇచ్చారు. బిగ్ బాస్ తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే తాజాగా.. శివాజీ  బిగ్ బాస్ కు ముందు నటించిన వెబ్ సీరీస్ కు(Web series) సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనౌన్స్ చేశారు.

శివాజీ నటించిన #90’s - మిడిల్ క్లాస్ బియోపిక్ (#90’s - A Middle Class Biopic) జనవరి 5 న ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలిపారు. 90’s ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో యాక్టర్ శివాజీ, వాసుకీ జంటగా నటించారు. ఇటీవలే జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ.. ఈ సీరీస్ ఆహ్లదంగా, ఉల్లాసంగా ఉంటుందని.. #90’s కిడ్స్  ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండబోతుందని తెలిపారు. అలాగే సినిమాలో తాను గణితం టీచర్ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది.. తన స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయన్నారు. 90’s జనరేషన్ కిడ్స్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఉల్లాసకరమైన కామెడీతో  క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో మౌళి, వసంతిక, రోహన్, స్నేహాల్ కమత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సీరీస్ ట్రైలర్ కూడా కామెడీ సీన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆదిత్య హాసన్ ఈ సీరీస్ కు దర్శకత్వం వహించారు. నవీన్ మేడరామ్, రాజశేఖర్ బొబ్బిలి సంయుక్తంగా నిర్మించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

Also Read: Pushpa 2: ‘ఈ సారి రూల్ పుష్పదే’.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

Advertisment
తాజా కథనాలు