TTD: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది.

New Update
TTD: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

TTD: తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని పేర్కొంది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుందని తెలిపింది.

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను, జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది. ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేసింది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు