Jo Biden: అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చికాగో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్ లో ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయన వేదిక పైకి రాగానే ఆయన కుమార్తె యాష్లీ బైడెన్ మాట్లాడుతూ.. నా తండ్రి ఆడపిల్లల పక్షపాతి...ఆయన మహిళలకు విలువనివ్వడం , నమ్మడం నేను చూశాను అని వివరించారు.
దీంతో ఆ మాటలకు బైడెన్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. వెంటనే పక్కకు తిరిగి కన్నీటిని తుడుచుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రేక్షకులనుద్దేశించి అమెరికా ..ఐ లవ్ యూ అని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమెరికాలో రాజకీయ హింసకు తావులేదు. ప్రజాస్వామ్యాన్ని కచ్చితంగా కాపాడాలి. అమెరికా ఆత్మనుకాపాడే యుద్దంలో మనం ఉన్నాం. అమెరికా గౌరవం చాలా ముఖ్యం. ఈ దేశంలో విద్దేషానికి చోటు లేదు. రోడ్లు, వంతెనలు, పోర్టులు,, ఎయిర్ పోర్టులు, రైళ్లు బస్సులను ఆధునికరించారం. అందరికీ అందుబాటులో హైస్పీడ్ నెట్ తీసుకొచ్చాం.
దేశాన్ని ఏకతాటిపైకి తీసుకుని వచ్చాం. ఆర్థిక అభివృద్దికి కృషి చేశాం. జీవన ప్రమాణాలను పెంచాం. కుప్పకూలుతున్న దేశంగా అమెరికాను ట్రంప్ అభివర్ణిస్తారు..ఈ రకంగా మాట్లాడి ఆయన ప్రపంచానికి ఏ సందేశం పంసిస్తున్నారు.
ప్రపచంలో మరే దేశంలో లేని విధంగా...మన చిన్నారులు తుపాకులకు బలవుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకే కమలా, నేను తుపాకుల చట్టాన్ని తెచ్చి గర్వపడుతున్నామని బైడెన్ వివరించారు. ఇక మారణాయుధాలను నిషేంధించాల్సిన సమయం ఆసన్నమైందని బైడెన్ పేర్కొన్నారు.
నా కెరీర్ లో చాలా తప్పులు చేశాను. నా అత్యుత్తమ సేవలు 50 ఏళ్లుగా అమెరికాకు అందించాను. దానికి లక్షల రెట్ల అభిమానం అమెరికన్ల నుంచి వచ్చిందని పేర్కొన్నారు.