Komatireddy: నల్గొండలో బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. సొంత నియోజకవర్గం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ బీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైన్మన్ తో పాటు మరో పది మంది కౌన్సిలర్లను హస్తం గూటికి చేర్చారు. ఈ రోజు వారంతా కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

New Update
Minister Komatireddy: బీఆర్‌ఎస్ భూస్థాపితమవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) రానున్న ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా పోటీకి దిగుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ లోనూ ఆయన పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నేపథ్యంలో సొంత స్థానంపై ఫుల్ ఫోకస్ పెట్టారు కోమటిరెడ్డి. గెలిచి మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) భారీ షాక్ ఇచ్చారు కోమటిరెడ్డి. నల్గొండ మున్సిపల్ బీఆర్ఎస్ వైస్ చైర్మన్ అబ్బగౌని రమేష్ గౌడ్ తో పాటు పదిమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేలా చక్రం తిప్పారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: కాంగ్రెస్ విజయం తథ్యం.. ఇదే మా ఆయుధం అంటూ సంచలన విషయాలు చెప్పిన భట్టి..

ఈ నేపథ్యంలో వారంతా ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఖాయం అని ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Khammam Politics: ఖమ్మం పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్.. రంగంలోకి మాజీ సీఎం కుమారుడు.. ఇండిపెండెంట్ గా బరిలోకి..

నల్గొండను దత్తత తీసుకుంటామన్న కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. నల్గొండలో రోడ్డు విస్తరణతో నష్టపోయిన వారికి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన పరిహారం ఇచ్చి ఆదుకుంటామన్నారు. కేసీఆర్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు మాత్రమే ముఖ్యమంత్రి అంటూ ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు