MLA Anil Kumar: తెలంగాణలో అధికార కాంగ్రెస్ (Telangana Congress) పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంపీలు నేతకాని వెంకటేష్, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరిపోయారు. మరికొన్ని రోజుల్లో మరింత మంది ఆ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో చేరికలను స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని (Pailla Shekar Reddy) చేర్చుకునే విషయంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Congress Politics: నాకు టికెట్ రాకుండా పొంగులేటి కుట్ర.. సోనియాకు సంపత్ సంచలన లేఖ!
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన పైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అస్సలు అంగీకరించడం లేదని సమాచారం. నిన్నమొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇరువురి నేతల మధ్య సయోధ్య అస్సలు కుదరడం లేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
గత రెండు ఎన్నికల్లో ప్రత్యర్థులు:
గత రెండు ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ పడ్డారు. 2014, 18 ఎన్నికల్లో పైళ్ల విజయం సాధించగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కుంభం విజయం సాధించారు. 2018 ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి చేరారు.