Dimple queen: రోజుకు 10లక్షలు సంపాదిస్తున్న డింపుల్‌ క్వీన్‌.. చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

ప్రస్తుతం పాక్‌ నటి హనియా అమీర్‌ పేరు మారుమోగిపోతోంది. ఇటివలే బార్బీ ఫోజుల్లో అదరగొట్టిన ఈ డింపుల్ క్వీన్‌ పాకిస్థాన్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే నటిల్లో ఒకరిగా మారిపోయారు. టీవీ షోల్లో ఒక గంట నటిస్తే ఆమెకు ఏకంగా 5లక్షల రూపాయలు ఇస్తున్నారట నిర్మాతలు. ఆమె అందం అలాంటిది మరి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Dimple queen: రోజుకు 10లక్షలు సంపాదిస్తున్న డింపుల్‌ క్వీన్‌.. చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
New Update

'హేయ్.. బొంగరాలంటి కళ్ళు తిప్పిందీ.. ఉంగరాలున్న జుట్టు తిప్పిందీ.. గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ.. అమ్మో బాపుగారి బొమ్మో.. ఓలమ్మో మల్లెపూల కొమ్మో'.. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన బ్లాక్‌ బసర్ట్‌ సినిమా 'అత్తారింటికి దారేది'లో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించిన ఈ పాట వింటే ఇప్పుడు మీరు చూడబోయ్యే అమ్మాయి గుర్తుకురాక మానదు..! పాకిస్థాన్‌ నటి హనియా అమీర్ (Hania Aamir) ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఫిల్మ్‌ లవర్స్‌గా మారిపోయింది. టీవీ షోల్లో ఆమెను చూసేందుకు కుర్రకారు షెడ్యూళ్లు మార్చుకుంటున్నారట.. హనియాకు అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల్లో కూడా యమ క్రేజ్‌ ఉంది.. ఈ సొట్ట బుగ్గల సుందరిని చూసిన వాళ్లు ఎవరైనా కానీ 'ఎంత అందం.. ఎంత అందం' అని చూపు తిప్పుకోలేకపోతున్నారట..!

బార్బీలగా మారిన భూమి పెడ్నేకర్, హనియా అమీర్ :
ప్రస్తుతం పాక్‌ వ్యాప్తంగానే కాకుండా బాలీవుడ్‌ లవర్స్‌ను సైతం తనవైపే చూపు తిప్పుకోగలిగిన హనియా సోషల్‌మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసే పోస్టుల కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తుంటారు హనియా ఫ్యాన్స్. ఇటివలే బార్బీ ఫోజులో ఓ వీడియో పెట్టింది హనియా. ఇది చూసిన నెటిజన్లు..రియల్ బార్బీ కంటే హనియానే అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటు భూమి పడ్నేకర్‌ సైతం పింక్‌ డ్రెస్‌లో బార్బీలాగా కిర్రాక్‌ అనిపించింది. ప్రస్తుతం ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాను ఊపేస్తున్నాయి.

publive-image హనియా అమీర్‌(image credit instagram/haniaheheofficial)

ఎవరీ హనియా?
హనియా అమీర్ ఫిబ్రవరి 12 1997న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జన్మించారు. ఉర్దూ టెలివిజన్ చిత్రాలలో హనియా కనిపిస్తుంటారు . ఆమె తన నటనా జీవితాన్ని పాకిస్థానీ హాస్య చిత్రం జనన్ (2016)తో ప్రారంభించింది. అదే సినిమాకు ఉత్తమ సహాయ నటిగా లక్స్ స్టైల్ అవార్డుకు నామినేట్ అయ్యింది . ఆ తర్వాత రొమాంటిక్ డ్రామా తిత్లీ(2017)లో నమ్మక ద్రోహం చేసే భార్య పాత్రతో టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టింది. పర్వాజ్ హై జునూన్ (2018)లో నటించడం ద్వారా ఆమె పేరు పాక్‌ వ్యాప్తంగా మారుమోగింది. అత్యధిక వసూళ్లు చేసిన పాకిస్థానీ చిత్రాలలో ఇది కూడా ఒకటి. 2020లో ఆమె ఫిరోజ్ ఖాన్ సరసన రొమైసా సిద్ధిక్ పాత్రలో రొమాంటిక్ ఇష్కియా(సిరీస్‌)లో నటించింది. 2021లో హినియా ఫర్హాన్ సయీద్‌కి జోడీగా మేరే హమ్‌సఫర్ అనే ఫ్యామిలీ డ్రామాలో హలా హమ్జా పాత్రను పోషించింది . ఈ సీరియల్ పాక్‌‌లోనే కాకుండా బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్‌లో కూడా అదిరిపోయే TRPలను సొంతం చేసుకుంది. దీంతో హనియా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

publive-image హనియా అమీర్‌(image credit instagram/haniaheheofficial)

రెమ్యునరేషన్‌లో టాప్‌:
ప్రస్తుతం పాక్‌ టీవీ షోల్లో నటిస్తున్న హనియా..అక్కడ అత్యధిక పారితోషికం తీసుకునే జాబితాలో టాప్‌ ప్లేస్‌కి దూసుకొచ్చారు. ఒక గంట షో కోసం నిర్మాతలు ఆమెకు ఏకంగా 5లక్షలు చెల్లిస్తున్నారట..అంటే రోజుకు రెండు షోలు చేస్తే హనియా బ్యాగ్‌లోకి 10లక్షలు వచ్చి చేరుతున్నాయి. ఇలా దాదాపుగా నెలకు 3కోట్లకు పైగా సంపాదిస్తూ దూసుకుపోతోంది హనియా. ఇదంతా కేవలం టీవీ షోల ద్వారానే సంపాదిస్తుండగా..ఇక మిగిలిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ద్వారా హనియా ఎంత సంపాదిస్తున్నారన్నదానిపై ఓ క్లారిటీ అయితే లేదు. కేవలం అందంతోనూ కాకుండా అభినయంలోనూ హనియా టాప్‌ అంటారు పాక్‌ సినీ లవర్స్‌. యాక్టింగ్‌లో కూడా హనియాకు ఫిదా అవుతారని.. అందుకే అమ్మాయిల్లోనూ హనియాకు అంత క్రేజ్‌ ఉందని చెబుతుంటారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe