మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారంతో అదరగొడుతోంది. తాజాగా మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్‌ను జులై 27న విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్, పాటలతో మేకర్స్ కావాల్సినంత వినోదాన్ని అందించారు. ఇప్పుడు ట్రైలర్ తో ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో, చిరంజీవి చేతిలో కత్తి పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించారు.
తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో నటిస్తున్నారు. చిరు సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్, ఆమె ప్రియుడిగా సుశాంత్ నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా రిలీజైన మిల్కీ బ్యూటీ సాంగ్ బాగా క్లిక్ అయింది.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నాడు భోళాశంకర్.