TDP Ganta: భీమిలి లోకల్ మేనిఫెస్టో రిలీజ్.. కూటమి లక్ష్యం ఇదే..!

భీమిలి లోకల్ మేనిఫెస్టో విడుదల చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు 22 అంశాలతో కూడిన లోకల్ మేనిఫెస్టో తీసుకొచ్చామన్నారు. వైసీపీ అధికారం లోకి రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అని పేర్కొన్నారు.

New Update
TDP Ganta: భీమిలి లోకల్ మేనిఫెస్టో రిలీజ్.. కూటమి లక్ష్యం ఇదే..!

TDP Ganta Srinivasa Rao: టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి లోకల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గత నెల రోజులుగా కసరత్తు చేసి నియోజవకర్గ ప్రజల అభిప్రాయం మేరకు 22 అంశాలతో కూడిన భీమిలి లోకల్ మేనిఫెస్టోను తీసుకొచ్చామన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మేనిఫెస్టో కి సముచిత స్థానం కల్పించామన్నారు. వైసీపీ ప్రభుత్వం హామీలు అమలుచెయ్యడంలో అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శలు గుప్పించారు.

Also Read: తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి.. ఎప్పుడో చెప్పేసిన ‘దేవర’ బ్యూటీ!

వైసీపీ అధికారం లోకి రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ భరించే శక్తి రాష్ట్ర ప్రజలకు లేదన్నారు. జూన్ 4న జగన్మోహన్ రెడ్డి రాజీనామా ఖాయమని..జూన్ 9న నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం వాస్తవమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు