Bhavyasri: భవ్యశ్రీ కేసులో ఆధారాలు నీటిలో కలిసిపోయాయంటున్న ఫారెన్సీక్ నిపుణులు..అసలేం జరిగింది?

భవ్యశ్రీ కేసులో అసలేం జరిగింది? భవ్యశ్రీ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నీటిలో మూడు రోజులుకు పైగా మృతదేహం ఉండడంతో అన్ని ఆధారాలు నీటిలో కలిసిపోయాయి అంటున్నారు ఫారెన్సీక్ నిపుణులు. దీంతో సరైన ఆధారం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అనుమానితులను విచారించినప్పటికీ ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి.

Bhavyasri: భవ్యశ్రీ కేసులో ఆధారాలు నీటిలో కలిసిపోయాయంటున్న ఫారెన్సీక్ నిపుణులు..అసలేం జరిగింది?
New Update

Bhavyasri : భవ్యశ్రీ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నీటిలో మూడు రోజులుకు పైగా మృతదేహం ఉండడంతో అన్ని ఆధారాలు నీటిలో కలిసిపోయాయి అంటున్నారు ఫారెన్సీక్ నిపుణులు. దీంతో సరైన ఆధారం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అనుమానితులను విచారించినప్పటికీ ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్‌ విద్యార్ధి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి వారం రోజులు గడుస్తున్నా మిస్టరీ వీడడం లేదు.

తల్లిదండ్రులు మాత్రం భవ్యశ్రీది హత్యే అని ఖండిస్తున్నారు. అత్యాచారం చేసి హత్య చేశారంటు తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. మా బిడ్డకు ఈత వచ్చు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, అసలు ఆత్మహత్య చేసుకుని పరిస్ధితి మా బిడ్డకు లేదు అంటూ చెప్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే మా బిడ్డ చనిపోయింది అని వాపోతున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటే మా బిడ్డ బ్రతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బిడ్డకు పట్టిన గతి మరే ఆడబిడ్డకు పట్టకూడదంటే నిందితులను ఎన్‌ కౌంటర్ చేయాలని తల్లిదండ్రులతో పాటు, వడ్డెర సంఘం నాయకులు, విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు

మరోవైపు చూస్తే భవ్యశ్రీది ఆత్మహత్య అంటున్నారు పోలీసలు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భవ్య శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. ప్రాథమిక వివరాలు చూస్తే ఆత్మహత్య గా కనబడుతుందని చెప్పారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ట్రోల్ చేయకండి అంటూ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి సూచించారు. అయితే, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి వ్యాఖ్యనించారు. భవ్య శ్రీదేవిది హత్య? ఆత్మహత్య? అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుగుతోందని ఆమె వెల్లడించింది.

భవ్యశ్రీ కేసులో అసలేం జరిగింది? కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందా? భవ్యశ్రీది హత్య? లేక ఆత్మహత్య? భవ్యశ్రీ ఫోన్ ఎక్కడా? అనుమానితుల కాల్ లిస్ట్ లో భవ్యశ్రీ నంబర్ లేదా? అసలు నిజం వెలుగులోకి వచ్చేదెప్పుడు? కేసులో కీలకంగా ఉన్న భవ్యశ్రీ జుట్టు నీటిలో ఉండడం వల్ల ఊడిందా, లేదంటే నిందితులు ఎవరైనా కట్ చేశారా? ఫోరెన్సిక్‌ రిపోర్ట్ లో ఏముంది? మూడు రోజులు మృతదేహం నీటిలో ఉంటే జుట్టు ఊడిపోతుందా? కనుబొమ్మలు ఊడిపోతాయా? గోర్లు కూడా ఊడిపోతాయా ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: మధ్యప్రదేశ్ లో దారుణం..అర్ధనగ్నంగా తీవ్ర రక్తస్రావంతో చిన్నారి నరకయాతన..!!

#bhavya-sri #ap-police #inter-girl-death-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe