Bhuvanagiri: ఇక దొంగతనాలు మా వల్ల కాదు..అరెస్ట్ చేయండి

ఈ పని మా వల్ల కాదు బాబోయ్‌..మమ్మల్ని అరెస్ట్‌ చేయండి సార్ ఫ్లీజ్‌..ఈ దొంగతనాలు చేయలేకపోతున్నాం..దొంగలెక్కలు రాయలేకపోతున్నాం.. అంటూ ఇద్దరు జల్సా బాయ్స్‌కు కష్టతరంగా మారింది. దీంతో వీరు చేసిన పనికి ఏటీఎం క్యాష్‌ లోడింగ్‌ సిబ్బంది అధికారులే అవాకయ్యారు.

New Update
Bhuvanagiri: ఇక దొంగతనాలు మా వల్ల కాదు..అరెస్ట్ చేయండి

పాపం ఎంత కష్టమొచ్చిందో..

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరంటారు.. కానీ ఈ దొంగలు మాత్రం వాళ్లే లొంగిపోయారు. ఇక తప్పు చేయలేం దేవుడా అంటూ మొరపెట్టుకుంటున్నారు. భువనగిరి ( Bhavanagiri) జిల్లాలో ఏటీఎం క్యాష్‌ లోడింగ్‌ (ATM cash loading)  సిబ్బంది అధికారులకు కళ్లు చెదిరే ట్విస్ట్‌ ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

క్యాష్‌ లోడ్‌ చేయమంటే.. నొక్కేశారు..?

భువనగిరికి చెందిన రాము, రాయగిరి  (ramu) ప్రాంతానికి చెందిన నగేష్‌ (nagesh) కొన్ని సంవత్సరాలుగా ముంబైకి చెందిన రైటర్స్‌ అనే ఏటీఎంలలో (atm) క్యాష్‌ లోడ్‌ చేసే ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ప్రతి రోజు యాదగిరిగుట్ట, భువనగిరి, రాయగిరి, వంగపల్లి, బీబీనగర్‌, బ్రాహ్మణపల్లి ప్రాంతాల్లో నేషనల్‌ బ్యాంక్‌ల ఏటీఎంలలో నగదు లోడ్‌ చేస్తుంటారు. అలా లోడ్‌ చేసిన వివరాలను రికార్డులలో రాస్తుంటారు. ఎప్పుడూ కళ్లు చెదిరేలా భారీగా డబ్బు చూస్తుండటం, అంతేకాక ఏజెన్సీ అధికారుల ఆడిటింగ్‌ లేకపోవడాన్ని ఆసరాగా తీసుకున్నారు. ఇంకేముంది తమ చేతికి పనిచెప్పారు జల్సా రాయుళ్లు.

తప్పుడు లెక్కలు చూపించలేం..

రెండేళ్లుగా కోటి 37 లక్షల రూపాయలను జల్సాల కోసం వాడుకున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు దొంగలెక్కలను రాశారు. బ్యాంక్‌ అధికారులు, ఏజెన్సీ కనిపెట్టకలేకపోయింది. రెండు ఏళ్లుగా బ్యాంకుల ఆడిటింగ్‌లో కూడా ఈ విషయం బయటికి రాలేదు. మరోవైపు తప్పుడు లెక్కలు చూపించడం ఈ ఇద్దరికి కష్టతరంగా మారింది. ఇక మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఏజెన్సీ  ( Agency in Hyderabad) ఆఫీసుకు వెళ్లి లొంగిపోయారు.

మోసాన్ని గుర్తించలేని అధికారులు

ఇకేముందు.. రెండేళ్లుగా ఏమేం చేశారో మొత్తం అధికారులకు చెప్పేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భువనగిరి టౌన్‌ పోలీసులకు ( Bhuvangiri Town Police) ఫిర్యాదు ( complaint)  చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి 5 లక్షల రూపాయలతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. ఇదంతా చూసిన అధికారులు ఆడిటింగ్‌పై దృష్టిపెట్టారు. బ్యాంక్‌ అధికారులు ( Bank officials) కూడా అప్రమత్తమయ్యారు. ఇలాంటివి పునరావృతం ( Repetition) కాకుండా  చూసుకుంటామని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు