Bharata Natyam: మనదేశంలో పిల్లలు పాశ్చాత్య పోకడల వైపు పరుగులు తీస్తున్నారు. మరోవైపు ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలు మన భారతీయ మహోన్నత సంస్కృతీ, సంప్రదాయాలను అడాప్ట్ చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. చైనాతో మన దేశానికి ఎన్నో విబేధాలు ఉన్నాయి. అయితే, అక్కడి ప్రజల్లో భారతీయ సంప్రదాయాల పట్ల మంచి అభిప్రాయం ఉంది. అంతేకాదు మన దేశ నాట్యరీతుల్ని నేర్చుకోవాలనే ఉత్సాహమూ ఉంది.
Bharata Natyam: ఇటీవల చైనాలో 13 ఏళ్ల బాలిక భారతనాట్యం నేర్చుకోవడమే కాకుండా, అందులో ఆరంగేట్రం (రంగప్రవేశం) చేసింది. ఇలా భారతనాట్యంలో ఆరంగేట్రం చేసిన తొలి చైనా వ్యక్తిగా ఆ బాలిక చరిత్ర సృష్టించింది. బీజింగ్ లో భరతనాట్య గురువైన లీలా శాంసన్, భారత దౌత్యవేత్తలు సమక్షంలో తన తొలి రంగస్థల ప్రదర్శన ఇచ్చి వారందరినీ తన నాట్యంతో ముగ్ధులను చేసింది. ఆ బాలిక పేరు లీ ముజీ.
Bharata Natyam: లీ ముజీ సాధించిన ఈ మైలురాయి చైనాలో భారతీయ నృత్య రూపానికి పెరుగుతున్న ఉనికిని వెల్లడించింది. లీ ముజ్జీ భరతనాట్యం అరంగేట్రం ఆగస్టు 11న జరిగింది. దీనిని భరతనాట్య నిపుణుడు లీలా శాంసన్, భారత దౌత్యవేత్తలు, బీజింగ్‌లోని చైనా ప్రేక్షకులు వీక్షించారు. దాదాపు రెండు గంటల పాటు ప్రదర్శన కొనసాగింది. ఆరంగేట్రం అనేది ఒకపురాతన దక్షిణ భారతీయ నృత్య సంప్రదాయం. ఇక్కడ నాట్యం నేర్చుకున్న విద్యార్థులు తమ నైపుణ్యాలను ఉపాధ్యాయులు, నిపుణులు, ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన తర్వాత, వారు స్వతంత్రంగా నృత్యం చేయడానికి లేదా ఇతరులకు నేర్పడానికి అనుమతి సాధిస్తారు.
Bharata Natyam: డూడూ అని కూడా పిలుచుకునే లీ ముజి తన భరతనాట్య ప్రయాణాన్ని 2014లో ప్రారంభించింది. అంటే తన మూడేళ్ళ ప్రాయంలోనే భారత నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ అరంగేట్రం తరువాత డూడూ ఆగస్ట్ తర్వాత చెన్నైలో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు PTI రిపోర్ట్ చేసింది. భారత నాట్యంలో లీ మ్యూజి గురువు జిన్ షాన్ షాన్. అతను చైనీస్ మూలానికి చెందిన మొదటి విజయవంతమైన భరతనాట్యం నృత్యకారులలో ఒకడు. జిన్ స్వయంగా ప్రఖ్యాత చైనీస్ డ్యాన్సర్ జాంగ్ జున్ వద్ద శిక్షణ పొందాడు. అతని దగ్గర పాఠాలను నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత, లీ నాట్య రూపం పట్ల గాఢమైన ప్రేమను పెంచుకుంది.