Ambedkar Jayanti: సమసమాజ స్వాప్నికుడు.. న్యాయ కోవిదుడి జయంతి నేడు!

భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సమసమాజ స్వాప్నికుడు భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారి 134వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకొంటు దేశవ్యాప్తంగా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Ambedkar Jayanti: సమసమాజ స్వాప్నికుడు.. న్యాయ కోవిదుడి జయంతి నేడు!
New Update

BR Ambedkar Jayanti 2024: భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సమసమాజ స్వాప్నికుడు భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకొంటు దేశవ్యాప్తంగా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన పాటలు, నినాదాలతో వాడలన్నీ మార్మోగుతున్నాయి.

BR Ambedkar Jayanti 2024


ఈ మేరకు ఎన్నో ఉన్నతమైన భావాలు కలిగిన సమూహ శక్తి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భరతమాత గడ్డపై పురుడు పోసుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఆయన జీవితంలోని ప్రతి అడుగు ఒక పూల బాటలేమీ కాదు ఒక కన్నీటి సంద్రం. ఈ నిత్య పోరాట యోధుడు రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా తన సొంత ఆలోచనలతో దేశానికే కాదు ప్రపంచ మానవాళికి దిశా నిర్దేశం చేశారు. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

తొలి న్యాయ మంత్రి..
భారత రాజ్యాంగ పితామహుడిగా పిలవబడే అంబేడ్కర్‌ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో ఒక దళిత మహర్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్‌ కీలకపాత్ర పోషించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేడ్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ ఆయన నియమితులయ్యారు. నిజానికి అంబేడ్కర్ ఇంటిపేరు అంబావ్డేకర్ (మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం ‘అంబవాడే’ పేరు నుండి వచ్చింది). అయితే అతని గురువు మహదేవ్ అంబేద్కర్ ఇంటిపేరును ‘అంబావ్డేకర్’ నుంచి ‘అంబేడ్కర్‌’గా పాఠశాల రికార్డులలో మార్చారు.

డబుల్ డాక్టరేట్ హోల్డర్..
బాబా సాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్‌లో పనివేళలను 12 గంటల నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్‌లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. అతని తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకనిగా పేరుగాంచారు. పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్‌ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్‌..
కొలంబియా యూనివర్శిటీలో ఉన్న మూడేళ్లలో, అంబేద్కర్ ఆర్థికశాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో ఆరు, ఫిలాసఫీలో ఐదు, హ్యుమానిటీస్‌లో నాలుగు, పాలిటిక్స్‌లో మూడు, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మన్‌లలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు. 1995లో అంబేద్కర్‌ రాసిన ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్‌’ పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్, బీహార్‌లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తరువాత 2000లో ఈ ప్రాంతాల విభజన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్. హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ తదితన తొమ్మిది భాషల్లో అంబేద్కర్‌కు పరిజ్ఞానం ఉంది. ఇంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మక అధ్యయనం చేశాడు అంబేడ్కర్.

#bharat-ratna #dr-br-ambedkars-birth-anniversary-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe