Bharat Brand: కిలో బియ్యం 25 రూపాయలకే.. కేంద్రం సూపర్ పథకం..

పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పుడు సగటున రిటైల్ మార్కెట్లో బియ్యం ధరలు కేజీకి 43 రూపాయలుగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కేజీ 25 రూపాయలకే భారత్ బ్రాండ్ పేరుతో ప్రజలకు బియ్యం సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసింది. 

New Update
Bharat Brand: కిలో బియ్యం 25 రూపాయలకే.. కేంద్రం సూపర్ పథకం..

Bharat Brand: ఇకపై ప్రభుత్వం భారత్ బ్రాండ్‌తో కిలో బియ్యాన్ని రూ.25కి విక్రయించనుంది. బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ విధంగా చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ బ్రాండ్‌తో పిండి, పప్పులను విక్రయిస్తోంది. ప్రస్తుతం దేశంలో కిలో బియ్యం సగటు ధర రూ.43గా ఉంది. ఈ బియ్యం  నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) అలాగే  కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా (Bharat Brand) విక్రయించనున్నారు.  ఈ విషయాన్ని  ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

గోధుమ పిండి కిలో రూ.27.50లకు.. 

Bharat Brand : కేంద్ర ప్రభుత్వం 2023 నవంబర్ 6న  'భారత్ పిండి'ని కిలో రూ.27.50కి విడుదల చేసింది. ఇది 10 కేజీలు మరియు 30 కేజీల ప్యాక్‌లలో అందుబాటులో తీసుకువచ్చారు.  గోధుమల ధర పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో సగటు పిండి ధర కిలో రూ.35గా ఉంది. భారత్ బ్రాండ్ అట్టా ఆవిష్కరణ సందర్భంగా దాని ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేశారు.

నవంబర్‌లో పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. 

Bharat Brand: నవంబర్‌లో ధాన్యం ధరలు 10.27%కి పెరిగాయి.  దీంతో నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.70%కి పెరిగింది.  అంతకుముందు నెలలో ఇది 6.61%గా ఉంది. అదే సమయంలో, రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల క్షీణత తర్వాత నవంబర్‌లో 5.55 శాతానికి పెరిగింది.

Also Read: మెడిక్లెయిమ్ గుడ్ న్యూస్.. హాస్పిటల్ లో చేరకపోయినా క్లెయిమ్ ఓకే!

ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుంది? తగ్గుతుంది?

Bharat Brand:ద్రవ్యోల్బణం పెరుగుదల- తగ్గుదల ఉత్పత్తి డిమాండ్- సరఫరాపై ఆధారపడి ఉంటుంది. ప్రజల వద్ద ఎక్కువ డబ్బు ఉంటే వారు ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే, ఈ వస్తువుల ధర పెరుగుతుంది. ఈ విధంగా మార్కెట్ ద్రవ్యోల్బణానికి గురవుతుంది. సరళంగా చెప్పాలంటే, అధిక డబ్బు ప్రవాహం లేదా మార్కెట్లో వస్తువుల కొరత ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. డిమాండ్ తక్కువగా - సరఫరా ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది.

ద్రవ్యోల్బణం CPI ద్వారా నిర్ణయిస్తారు.. 

Bharat Brand: వినియోగదారుగా, మనం అందరం  రిటైల్ మార్కెట్ నుండి వస్తువులను కొనుగోలు చేస్తాము. దీనికి సంబంధించిన ధరలలో మార్పులను చూపించే పనిని వినియోగదారు ధర సూచిక అంటే CPI చేస్తుంది. వస్తువులు - సేవలకు మనం చెల్లించే సగటు ధరను CPI కొలుస్తుంది.

ముడి చమురు, వస్తువుల ధరలు, తయారీ ఖర్చులు కాకుండా, రిటైల్ ద్రవ్యోల్బణ రేటును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అనేక అంశాలు ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం రేటును నిర్ణయించే ధరల ఆధారంగా దాదాపు 300 వస్తువులు ఉన్నాయి.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు