మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజైన భజే వాయువేగం టీజర్! By Durga Rao 22 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్.. టీజర్ తో పాటు టైటిల్ ఇట్రెస్టింగ్ గా ఉందని మెచ్చుకున్నారు. "భజే వాయు వేగం"చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. "భజే వాయు వేగం" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేటతో టీజర్ మొదలైంది. మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్ అంతా ఇదే టాస్క్ మీద ఫోకస్ చేస్తుంది. మరోవైపు కార్తికేయ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూనే తండ్రితో ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్ ను చూపించారు. రాహుల్ టైసన్ క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్ లో అది మా నాన్న అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ లో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పాటు కార్తికేయ గుమ్మకొండ ఎనర్జీ కనిపించింది. "భజే వాయు వేగం" సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. #karthikeya-megastar-chiranjeevi #bhaje-vaayu-vegam-teaser మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి