ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్స్.. 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా!

భాగ్యశ్రీ బోర్సే 'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.. ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ అందుకుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ 'VD12' లో సెలెక్ట్ అయింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాలో నటించనుంది.

New Update
ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్స్.. 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా!

Bhagyasree Borse Got Another Movie Offer : బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సౌత్ లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. రవితేజ హీరోగా నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తన ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వకముందే మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ అందుకుంది.

మిస్టర్ బచ్చన్ ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. ఈ మూవీ ఇంకా సెట్స్ పై ఉండగానే ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఇప్పుడు మరో మూవీ ఆఫర్ పట్టేసింది.

Also Read : పెళ్లి పై నోరు విప్పిన ‘ఎన్టీఆర్’ హీరోయిన్.. అతనితో డేటింగ్ లో ఉన్నా అంటూ కామెంట్స్!

ముచ్చటగా మూడోది...

మలయాళ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఓ చిత్రం నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. రవి అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంచుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ఈ విషయంపై చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదొక డిఫెరెంట్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని.. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు