/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ycp-war-jpg.webp)
YCP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసిపిలో వర్గ పోరు భగ్గుమంది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అరుణ్ సమక్షంలో వైసిపి నేతల మధ్య మాటా మాటా పెరిగి తోపులాట జరిగింది. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసిపి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇటీవల జరిగిన పెండ్యాల వార్డు 1లో ఎంపిపి మలక్ బషీర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే, ఈ కార్యక్రమంకు MPTC వర్గాన్ని ఆహ్వానించ లేదు. దీంతో ఆ వర్గం శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. కాగా, నిన్న వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం MPTC బడే హజరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మరో వైసిపి శ్రేణులు. అయితే, ఈ కార్యక్రమానికి ఎంపిపి మలక్ బషీర్ ను పిలిచి ప్రచార రధం ఎక్కించడంతో వైసీపీ శ్రేణుల మధ్య వివాదం జరిగింది.
Also read: నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు ఇవే.!
ఇటీవల జరిగిన ఎంపిపి మలక్ బషీర్ బైక్ ర్యాలీ కి MPTC వర్గాన్ని ఆహ్వానించక పోవడం, నిన్న MPTC ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపిపిని పిలిచి ప్రచార రధం ఎక్కించడంతో మాటా మాటా పెరిగి తోపులాట జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అరుణ్ సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. రెండు వర్గాల మధ్య గొడవ తారా స్థాయికి చేరిన నేపథ్యంలో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ అరుణ్. ఇరు వర్గాలు తగ్గకపోవడంతో ఎంపిపి మలక్ బషీర్ ను బలవంతంగా తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్.
వైసిపి పార్టీని సొంత పార్టీ నేతలే నాశనం చేస్తున్నారని ఎమ్మెల్సీ అరుణ్ సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపిపి మలక్ బషీర్. ఈ క్రమంలో డౌన్ డౌన్ ఎమ్మెల్యే.. డౌన్ డౌన్ ఎమ్మెల్సీ.. డౌన్ డౌన్ ఎంపిపి అంటూ నినాదాల చేశారు MPTC బడే హజరత్ వర్గీయులు. అయితే, ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ అధికార పార్టీ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడటం నియోజకవర్గంలో చర్చకు దారి తీసిన పరిస్థితి కనిపిస్తోంది.
 Follow Us
 Follow Us