Heavy rain in hyderabad : హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకుని చిన్నచిన్నగా మొదలైన వర్షం జోరందుకుంది. వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. లంచ్ సమయానికి మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరించింది.
నిన్న రాత్రి నుంచి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు కమ్ముకున్నప్పటికీ పెద్దగా వర్షం కురవలేదు. కానీ ఈ రోజు ఉదయం ఎండతో మొదలైన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, రామంతపూర్, అంబర్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోటి, మలక్‌పేట్, అబిడ్స్, బంజారహిల్స్, అమీర్‌పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లంచ్ సమాయానికి వర్షం మొదలవ్వడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు, మరోవైపు శంషాబాద్, ఆరాంఘర్, చంద్రాయణగుట్ట, అత్తాపూర్,రాజేంద్రనగర్, టోలిచౌకి, మెహదీపట్నం, లంగర్‌హౌజ్, గచ్చిబౌలి, నార్సింగ్, బండ్లగూడ, నానక్‌రామ్‌గూడ, శేరిలింగంపల్లి,పటాన్‌చెరు, మియాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది, మరో కొన్ని గంటల్లో ఇతర ప్రాంతాల్లోనూ భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..
అలాగే రానున్న కొద్ది గంటల్లో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్,రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి,సిరిసిల్ల, కరీంనగర్,ములుగు, భూపాలపల్లి,పెద్దపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మాన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్...! ఉరేసుకుని భార్య...
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30--40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.. హైదరాబాద్‌తో పాటు మధ్య తెలంగాణలో జల్లులు, కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండండి : ముఖ్యమంత్రి ఆదేశం
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
ఇది కూడా చూడండి: Tapan Deka: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు
హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.
ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’