Broom Tips: చీపురును ఇలా ఉంచితే వద్దన్నా డబ్బే! ట్రై చేయండి!

చీపురును కుబేర, లక్ష్మీస్థానం అంటారు. ఇళ్లు ఊడ్చిన తర్వాత దానిని నేలమీద పడుకోబెట్టాలి. వీలైనంత వరకు కాళ్ళకు తగలకుండా.. ఎవరి దృష్టి దానిమీద పడకుండా ఒక మూలకి పెడితే మంచిది. ఈ విధంగా పెట్టిన ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Broom Tips: చీపురును ఇలా ఉంచితే వద్దన్నా డబ్బే! ట్రై చేయండి!
New Update

Broom Tips: ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి చీపురు ఎంతో ముఖ్యమైనది. చీపురిని ఐశ్వర్య వృద్ధిని కూడా సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురుని ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదట. అలా పెట్టడం వల్ల ఇంట్లో కుబేర, లక్ష్మి స్థానం ఉండదంటున్నారు. చీపురుతో ఇళ్లు శుభ్రం చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలి..? ఎలా పెట్టాలి అనేది చాలామందికి తెలియదు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే చీపురుని ఎక్కడ ఎలా పెట్టాలో ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

publive-image

ఇంట్లో ధూళి, మట్టితో నడుస్తూ ఉంటాం. ఇల్లంతా కూడా ఎప్పటికప్పుడు చిరాగ్‌గా అవుతూ ఉంటుంది. ఆ చిరాకుని అలా ఉంచుకోకుండా ఉదయం సాయంత్రం చీపురుతో ఇంటినంతా శుభ్రపరుచుకుంటూ ఉంటాము. ఇళ్లకు సంబంధించి ముందు చీపురు.  చీపురు కుబేర, లక్ష్మీస్థానం అందుకని చీపురుని ఊడ్చడం అయిపోయిన తర్వాత ఎలా పడితే అలా పెట్టకూడదు. అలాగే చీపురి ముందు అంచులతో ఊడ్చేవాళ్ళు ఉంటారు. అలా ఊడ్చకుండా చీపురి మధ్య స్థానం నెలకు తగిలేలా ఊడ్చాలి. దానివల్ల ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి జరుగుతూ ఉంటుంది. చీపురిని ఉంచే స్థానాన్ని బట్టి కూడా ఐశ్వర్య వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది మంచాల కింద, మూలన నిలబెడుతారు. ఈ పద్ధతి అనేది మంచిది కాదు. లక్ష్మీ తత్వమైనటువంటి చీపురిని ఉంచే అసలైనటువంటి విధానం నేలమీద పడుకోబెట్టాలి. వీలైనంత వరకు కాళ్ళకి తగలకుండా.. ఎవరి దృష్టి దానిమీద పడకుండా ఒక పక్కన పడుకోబెట్టాలి. ఈ విధానం ఉన్నతమైనటువంటి స్థితి అని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే 7 అద్భుతమైన ప్రయోజనాలు!

#broom-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe