Skin Care Tips: నోటిని రిఫ్రెష్ చేయడమే కాకుండా తమలపాకులు చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి. తమలపాకుల నుంచి ఫేస్ ప్యాక్ చేయడానికి.. ఈ ఆకులను గ్రైండ్ చేసి దానికి కొంత పెరుగు వేసి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆపై శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి తమలపాకులను ఉపయోగించవచ్చు. ఇది ముఖానికి ఎలా ఉపయోగకరంగా ఉంటాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
తమలపాకులను చర్మానికి వాడడం ప్రయోజనాలు:
- ముఖాన్ని అందంగా మార్చుకోవాలనుకుంటే తమలపాకులను వాడే విధానం:
- తమలపాకుల రసాన్ని తీసి దూదితో ముఖానికి రాసుకుంటే టోనర్‌గా పని చేస్తుంది.
- తమలపాకుల నుంచి స్క్రబ్ చేయడానికి ఆకులను గ్రైండ్ చేసి అందులో బియ్యప్పిండిని మిక్స్ చేయాలి. ఇలా పేస్ట్ తయారు చేసి ముఖానికి 10 నిమిషాలు మసాజ్ చేసి ఆపై ముఖం కడగాలి.
- తమలపాకులను ఉపయోగించడం ద్వారా మొటిమలు, మచ్చలు, ముడతలను వదిలించుకోవచ్చు. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చడంలో, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
- తమలపాకులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై చికాకు కలుగుతుందని గుర్తుంచుకోవాలి. దీనిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి దీనికి అలెర్జీ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: డిజిటల్ ‘ఐ’ స్ట్రెయిన్ వల్ల ఒత్తిడి ఎలా పెరుగుతుందో తెలుసా?