Vacation : బడ్జెట్ తక్కువ.. ఎంజాయ్మెంట్ ఎక్కువ.. ఇండియాలోని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్

భారతదేశంలో అతి తక్కువ బడ్జెట్ లో సందర్శించే కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలలోని చౌకైన వసతి, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. డార్జిలింగ్, వారణాసి, రిషికేశ్, కసోల్. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఈ ప్రదేశాలు ఉత్తమం.

Vacation : బడ్జెట్ తక్కువ.. ఎంజాయ్మెంట్ ఎక్కువ.. ఇండియాలోని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్
New Update

Vacation Enjoyment : సెలవుల సమయంలో (Holidays), బోరింగ్ లైఫ్ (Boring Life) నుంచి దూరంగా ఎక్కడికైనా ప్రయాణించాలని భావిస్తారు. కానీ మీ బడ్జెట్ గుర్తురాగానే చాలా మంది అక్కడే ఆగిపోతారు. ఎందుకులే అని లైట్ తీసుకుంటారు. అయితే బడ్జెట్ ఉంటేనే ట్రిప్ వెళ్ళగలం అనేదేమి లేదు. మనకున్న బడ్జెట్ లో కూడా అందమైన ప్రదేశాలను ఎక్స్ ప్లోర్ చేయవచ్చు. అతి తక్కువ ఖర్చుతో సందర్శించే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

డార్జిలింగ్

చుట్టూ పచ్చదనం, తేయాకు తోటలు, డార్జిలింగ్ స్వర్గం కంటే తక్కువ కాదు. అతి తక్కువ ఖర్చుతో వెళ్లగలిగే ప్రదేశాల్లో ఇది ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కాంచన్‌జంగా పర్వత అద్భుతమైన దృశ్యాన్ని చూడటం నుంచి , స్థానిక చైనీస్ ఆహారాన్ని తినడం వరకు, డార్జిలింగ్ ఉత్తమ ప్రదేశాలలో ఒకటి.

వారణాసి

వారణాసి భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని. ఈ నగరంలో అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి. పవిత్ర గంగా నదిని చూసేందుకు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. చౌకైన ఆహారం, వసతి, ప్రశాంతమైన వాతావరణం కారణంగా ఈ ప్రదేశం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

Vacation

రిషికేశ్

ఇది యోగా రాజధాని (Yoga Capital) గా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ప్రదేశం యోగా కోసం మాత్రమే కాకుండా రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ వంటి కార్యకలాపాలకు పాపులర్. ఇక్కడ ఈ సాహసాలను పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు.

కసోల్

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) లో చూడదగిన అందమైన నగరాలలో కసోల్ ఒకటి. ఇక్కడి లోయలతో సందర్శకులు ప్రేమలో పడతారు. కులు నుంచి కసోల్ కేవలం 40 కి.మీ దూరంలో ఉంది. సాహస ప్రియులకు ఈ ప్రదేశం ఉత్తమమైనది. ఇక్కడ మీ బడ్జెట్ ప్రకారం హోటల్ గదిని బుక్ చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో కసోల్ అందాలను ఆస్వాదించవచ్చు.

Also Read: Sugar: చక్కెర ఆరోగ్యానికి సైలెంట్ కిల్లర్.. ఎంత తినాలో తెలుసుకోండి! - Rtvlive.com

#himachal-pradesh #low-budget-vacation #vacation-places
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe