Heart Health: గుండెకు మేలు చేసే మసాలా దినుసులు.. తప్పక తెలుసుకోండి

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ప్రత్యేక మసాలా దినుసులు ఉన్నాయి. వీటిలోని అధిక యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. నల్ల మిరియాలు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క ఆహారంలో తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు.

New Update
Heart Health: గుండెకు మేలు చేసే మసాలా దినుసులు.. తప్పక తెలుసుకోండి

Heart Health: ఆరోగ్యవంతమైన గుండెకు ఎంతో మేలు చేసే కొన్ని ప్రత్యేక మసాలా దినుసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మసాలా దినుసులలో అధిక యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అవేంటో చూడండి.

నల్ల మిరియాలు

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నల్ల మిరియాలు అద్భుతంగా పని చేస్తాయి. వీటిలోని పైపరిన్ అనే కాంపౌండ్ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల నుంచు రక్షిస్తుంది.

కొత్తిమీర

కొత్తిమీర గుండెకు ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకని కొత్తిమీరను రోజూ తినే ఆహారంలో చేర్చుకోవడం గుండెకు మంచిది.

వెల్లుల్లి

వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రాణాంతకమైన LDL కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అల్లం

అల్లం శరీరానికి, గుండెకు కూడా చాలా ప్రయోజనాలను కలిగించును. దీనిని ఆహారంలో అనేక విధాలుగా తీసుకోవచ్చు. వంటకాల్లో లేదా పానీయాల రూపంలో తీసుకోవచ్చు .

పసుపు

పసుపు గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పసుపు వినియోగం కూడా చాలా ముఖ్యం. పసుపులో కుర్కుమిన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

దాల్చిన చెక్క

దాల్చినచెక్కలో పుష్కలమైన గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించి.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Lord Rama Temples: దేశంలో ప్రసిద్ధి చెందిన రామాలయాలు.. జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు