Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ అదిరే ఆఫర్‌..రూ.599తో సూపర్‌ ఫోన్..ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దు..!

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రియల్‌మి సీ55 స్మార్ట్‌ఫోన్ ధరను అందుబాటులోకి తెచ్చింది. రూ.13,999గా ఉన్న ఈ ఫోన్‌ ధర ప్రస్తుతం 14డిస్కౌంట్‌తో రూ.11,999కు లభిస్తుంది. ఇక ఎక్స్‌ఛైంజ్‌తో రూ. 10,400 వరకు తగ్గింపు లభిస్తోంది. ఎక్స్‌ఛైంజ్‌లో ఈ ఫోన్‌ను కేవలం రూ. 599కే సొంతం చేసుకోవచ్చు.

New Update
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ అదిరే ఆఫర్‌..రూ.599తో సూపర్‌ ఫోన్..ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దు..!

ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త ఆఫర్లతో ముందుకువస్తుంది. ముఖ్యంగా మొబైల్స్‌కు సంబంధించిన ఆఫర్లను ఎక్కువగా తీసుకొస్తుంది. ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం రియ‌ల్‌మీ.. భార‌త్ మార్కెట్‌లోకి `సీ55` పేరిట గత మార్చిలో బ‌డ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. త్రీ రామ్ అండ్ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ల‌లో ల‌భ్యం అవుతుంది. ఆపిల్ ఐ-ఫోన్ త‌రహాలో స్లిమ్ డిజైన్‌తో రిలీజైన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ అది. అంతే కాదు బ్యాట‌రీ సామ‌ర్థ్యం,డేటా వాడ‌కంతోపాటు హెల్త్‌కు ప్రాధాన్యం ఇచ్చే స్టెప్ కౌంట్‌ వివ‌రాలు తెలిపేందుకు డిజైన్ చేసిన `మినీ క్యాప్సుల్‌` ఫీచ‌ర్ కొత్త‌గా జ‌త చేసింది. ఇప్పుడిదే ఫోన్‌పై ఆఫర్‌ నడుస్తోంది.

సూపర్‌ డూసర్‌ ఆఫర్:
రియల్‌మి కంపెనీకి చెందిన సీ55 స్మార్ట్‌ఫోన్ అందుబాటు ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,999గా ఉంది. అయితే మీరు దీన్ని రూ. 11,999కు కొనొచ్చు. అంటే ఈ ఫోన్‌పై మీకు 14 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొంటే రూ.525 డిస్కౌంట్ వస్తుంది. ఇంకా కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. రూ. 500 అదనపు తగ్గింపు పొందొచ్చు. ఇలా మీరు ఈ ఫోన్‌ను రూ. 10 వేల కన్నా తక్కువకే కొనొచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై మరో ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ డీల్ సొంతం చేసుకోవచ్చు. రూ. 10,400 వరకు తగ్గింపు లభిస్తోంది. అంటే ఎక్స్చేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 599కే సొంతం చేసుకోవచ్చు.

publive-image రియల్ మి సీ11

ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..
--> 6.72-అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్ విత్ ఫుల్ హెచ్‌డీ+ రిజొల్యూష‌న్‌.
--> గ‌రిష్ట రీఫ్రెష్ రేట్ 90హెర్ట్జ్, గ‌రిష్ట ట‌చ్ శాంప్లింగ్ రేట్ 180హెర్ట్జ్‌.
--> ఎల్‌సీడీ ప్యానెల్‌తోపాటు ప‌వ‌ర్ బ‌ట‌న్ కింద ఫింగ‌ర్‌ప్రింట్ రీడ‌ర్‌.
--> మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ ఆఫ‌ర్డ్ విత్ ఎల్పీడీడీఆర్‌4ఎక్స్ రామ్ అండ్ ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ.
--> మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వ‌ర‌కు ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీ పెంపు.
--> కెమెరా సెట‌ప్ ఇలా

రియ‌ల్‌మీ సీ 55 డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌
--> 64-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా.
--> 2 – మెగా పిక్సెల్ కెమెరా.
--> సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా.
--> ఆండ్రాయిడ్ 13 వ‌ర్ష‌న్‌తో ప‌ని చేస్తుంది.
--> వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్‌, చార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్‌ఫ‌ర్ కోసం యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ.
--> 5,000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ స‌పోర్ట్‌.
--> 33 వాట్ల సూప‌ర్ వూక్ వైర్డ్ చార్జ‌ర్‌.

రియల్‌మీ సీ55 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో ఫోటో, బ్యూటీ, ఫిల్టర్, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, పోర్ట్రెయిట్ మోడ్, HDR, AI సీన్ రికగ్నిషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.2 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు రూ. 529 ఈఎంఐతో కూడా కొనొచ్చు. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 682 కట్టాలి. ఏడాది టెన్యూర్ అయితే నెలకు రూ. 988 చెల్లించాలి. 9 నెలల టెన్యూర్‌కు రూ. 1300 చెల్లించాలి. 6 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1909 పడుతుంది. ఇలా మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు