Berlin Heart: రెండేళ్ల చిన్నారికి ప్రాణం పోసిన బెర్లిన్ హార్ట్..ఏమిటో తెలుసుకుందాం.. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రెండేళ్ల చిన్నారికి బెర్లిన్ హార్ట్ అమర్చి నాలుగు నెలల పాటు జీవితాన్ని నిలబెట్టారు డాక్టర్లు. దేశంలో ఇటువంటి చికిత్స జరగడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. మొదటిసారి ఈ చికిత్స విజయవంతం కాలేదు. By KVD Varma 01 Dec 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Berlin Heart: తల్లిదండ్రులు జన్మనిస్తారు. కానీ, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పోసే వారు భగవంతునితో సమానం. బెర్లిన్ హార్ట్ తో రెండేళ్ల చిన్నారికి ప్రాణం పోసిన ఆ డాక్టర్లు ఇప్పుడు నిజంగా దేవుళ్లుగా నిలిచారు. గుండె మార్పిడి అవసరమైన ఒక చిన్నారికి బెర్లిన్ హార్ట్ అమర్చి ప్రాణాలను నిలబెట్టారు ఆ డాక్టర్లు. బెర్లిన్ హార్ట్ అంటే ఏమిటి? ఈ చిన్నారికి ఇచ్చిన కృత్రిమ గుండెను వైద్య పరిభాషలో బెర్లిన్ హార్ట్(Berlin Heart) అంటారు. బెర్లిన్ హార్ట్ అనేది ఒక రకమైన వెంట్రిక్యులర్ అసిస్ట్ పరికరం. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు ఇది తాత్కాలిక పరిష్కారం. వెంటనే గుండె మార్పిడి అవసరమైనప్పటికీ గుండె దాత వెంటనే దొరకని పరిస్థితుల్లో అటువంటి రోగులకు బెర్లిన్ హార్ట్(Berlin Heart) ఇస్తున్నట్లు శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందంలో ఒకరైన శస్త్రచికిత్స సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ముఖేష్ గోయల్ తెలిపారు. గుండె దాత దొరకడానికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు పట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఈ కృత్రిమ పరికరం ద్వారా రోగిని సజీవంగా ఉంచుతారు. ఈ పరికరంలోని పంప్ శరీరం వెలుపల యంత్రాలతో అనుసంధానించి ఉంటుంది. రక్తాన్ని పంప్ చేస్తుంది. దీనికోసం రోగి ఆసుపత్రిలో ఐసీయూలో ఉండాల్సి ఉంటుంది. Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ క్రేజ్.. డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేసేస్తున్నారు ఒక్కోసారి నిజమైన గుండె అమర్చే పరిస్థితి కూడా కొందరికి ఉండదు. ఎక్కువగా వృద్ధులకు ఇది కుదరని పని. అటువంటి సందర్భాలలో ఈ రోగులు కృత్రిమ గుండె తో మామ్ శేష జీవితాన్ని గడపాల్సి వస్తుంది. దీనితో ఆ వ్యక్తి 8 నుంచి 10 సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుంది. చిన్నారికి నాలుగు నెలల పాటు కృత్రిమ గుండె.. కృత్రిమ అవయవాల గురించి డాక్టర్ గోయల్ మాట్లాడుతూ, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకా మెరుగుదలకు అవకాశం ఉందని, భవిష్యత్తులో ఈ కృత్రిమ అవయవాల ద్వారా మిలియన్ల మంది ప్రాణాలను కాపాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం 4 నెలలుగా ఈ కృత్రిమ గుండె(Berlin Heart)తో జీవిస్తున్న బాలికకు నిజమైన గుండె వచ్చిందని, గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి బిడ్డకు వైద్యులు విజయవంతంగా కొత్త జీవితాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది. గతంలో చెన్నైలో ఇలాంటి శస్త్రచికిత్స ఒకటి జరిగింది. కానీ ఆ శస్త్రచికిత్సలో కృత్రిమ గుండెతో రోగి కేవలం 2 వారాలు మాత్రమే జీవించగలిగాడు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు చేసిన శస్త్రచికిత్స భారతదేశంలో ఇది రెండవసారి. దీనిలో బాలిక అసలు గుండె దొరికేంత వరకూ 4 నెలల సుదీర్ఘ సమయం జీవించ గలిగింది. #heart-disease #transplant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి