Health Tips: అరిటాకులో అన్నం.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? పూర్వ కాలంలో మాత్రం అరిటాకు లేనిదే భోజనం చేసేవారు కాదు. అరిటాకులో భోజనం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు పెద్దవారు. అరిటాకులో ఎక్కువగా ఫాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. By Bhavana 02 Oct 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పూర్వ కాలంలో భోజనం చేయాలంటే కచ్చితంగా విస్తారకులోనో, అరిటాకు(Banana Leafs) లోనో చేసేవారు. కానీ రోజులు మారుతున్న కొద్ది ఇత్తడి,రాగి, వెండి, స్టీలు పళ్లాల్లో భోజనం చేయడం పరిపాటిగా మారింది. అయితే ఏదైనా శుభ కార్యం జరుగుతున్న సమయంలో పేపర్ ప్లేట్లని వాడుతూ ఆరోగ్యంతో పాటు వాతావరణాన్ని కూడా పాడు చేస్తున్నాం. కానీ పూర్వ కాలంలో మాత్రం అరిటాకు లేనిదే భోజనం చేసేవారు కాదు. అరిటాకులో భోజనం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు పెద్దవారు. అరిటాకులో ఎక్కువగా ఫాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వలన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తి లభిస్తుంది. అంతేకాకుండా కడుపులో ఏర్పడే అలర్జీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగుతాయి. అరటి ఆకులలో ఎక్కువగా క్లోరోఫిల్ అనే పదార్థం ఉండటం వల్ల వేడి అన్నం పెట్టుకొని తినడం వల్ల ఆ వేడికి ఆకులో ఉన్నటువంటి పోషక పదార్థాలు అన్నంలో కలిసి మన శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అరిటాకులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల మన శరీరానికి సరిపడినంత పొటాషియం గుండెకు సంబంధించిన వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇదంతా ఇలా ఉంటే.. శత్రువులు ఎవరైనా మనం తినే ఆహారంలో కానీ విష ప్రయోగం చేస్తే అరిటాకులో భోజనం వడ్డించడం వల్ల ఆహారం మొత్తం కూడా నీలి రంగులోకి మారిపోతుంది. అదే విధంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధులను దూరం చేయడంలో కూడా అరిటాకు ఎంతో ఉపయోగపడుతుంది. #health-tips #banana-leafs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి