Viral: అపార్ట్ మెంట్ లో ఓపెన్ శృంగారం.. కిటికీలు, తలుపులు తెరిచి దారుణం!

పక్కింట్లో ఉంటున్న ఓ జంట ఓపెన్ విండో రొమాన్స్ చేస్తున్నారంటూ మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిటికీలు, తలుపులు తెరిచి నగ్నంగా శృంగారంలో పాల్గొనడం, తమ హావభావాలు బయటకు వినిపించేలా అరవడం తమకు చికాకు తెప్పిస్తున్నాయని వాపోయింది. ఈ ఘటన బెంగళూర్ లో చోటుచేసుకుంది.

New Update
Viral: అపార్ట్ మెంట్ లో ఓపెన్ శృంగారం.. కిటికీలు, తలుపులు తెరిచి దారుణం!

Bengaluru: తమ పక్కింట్లో ఉంటున్న ఓ జంట ఓపెన్ విండో రొమాన్స్ చేస్తున్నారంటూ మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిటికీలు, తలుపులు తెరిచి నగ్నంగా శృంగారంలో పాల్గొనడం, తమ హావభావాలు బయటకు వినిపించేలా అరవడం తమకు చికాకు తెప్పిస్తున్నాయని వాపోయింది. అంతేకాదు ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన బెంగళూర్ లో చోటుచేసుకుంది.

డోర్, విండోస్ ఓపెన్ చేసి..
బెంగళూర్ ను ఇప్పటికే నీటి కొరత, ట్రాఫిక్ రద్దీ, కరువు సిలికాన్ సిటీని పట్టి పీడిస్తున్న నేపథ్యంలో ఓ విచిత్రమైన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని అవలహళ్లి ప్రాంతంలో నివసిస్తున్న 44 ఏళ్ల మహిళ.. తన పొరుగువారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డోర్, విండోస్ ఓపెన్ చేసి శృంగారంలో పాల్గొంటున్నారని, ఇది తమ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు పద్ధతి బాగోలేదని, మార్చుకోవాలని చెబితే ఆ జంట తనపై బెదిరింపులకు పాల్పడిందని వాపోయింది.

ఇది కూడా చదవండి: Lokesh: ఓటమి భయంతోనే చంపుతున్నారు.. వైసీపీపై లోకేష్ ఫైర్!

పలు సెక్షన కింద కేసు నమోదు..
అయితే ఈ ఇష్యూ గురించి ఆ ఇంటి ఓనర్ తో చెబితే వారంతా ఆ జంట పక్షాన నిలిచారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఓపిక నశించి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన పోలీసులు.. ఇతరుల శాంతి భంగం, నేరపూరిత బెదిరింపులు, అవమాన పరిచే మాటలు, రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని 504, 506, 509, 34 సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisment
తాజా కథనాలు