నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు..!!

పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జూలై 8న జరిగిన పోలింగ్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. సాయంత్రంలోగా ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

New Update
నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు..!!

పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత జిల్లా సమితి, జిల్లా పరిషత్‌ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూలై 8న జరిగిన ఎన్నికల్లో హింస, బూత్ కబ్జాలు, ఓటరు బెదిరింపులకు సంబంధించిన అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అనేక మంది అరెస్టుల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను మమతా బెనర్జీ ప్రభుత్వానికి ప్రజాదరణ పరీక్షగా భావిస్తున్నారు. జూలై 8న పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

publive-image

మూడు దశల పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. 22 జిల్లాల్లో దాదాపు 339 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల సాయుధ సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వెలుపల క్రిమినల్ పీనల్ కోడ్ సెక్షన్ 144 విధించారు.

పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభం అయ్యింది. ఓటింగ్ సందర్భంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.ప్రిసైడింగ్ అధికారి సంతకం లేని బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ పేపర్ వెనుక రబ్బరు స్టాంప్ తగిలిస్తే చెల్లదని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్ సమయంలో బ్యాలెట్ బాక్సులను ట్యాంపరింగ్ చేయడం, హింసాత్మక ఘటనల్లో 18 మంది మరణించడం వంటి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) రీపోలింగ్‌కు ఆదేశించింది.

అటు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద్ బోస్ పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ పరిస్థితిని సమీక్షించేందుకు భాంగర, కానింగ్‌తో సహా దక్షిణ 24 పరగణాల జిల్లాను సందర్శించనున్నారు. పొలిటికల్‌ కంట్రోల్‌ రూమ్‌లో కూర్చొని గూండాలకు మార్గనిర్దేశం చేసినా, రిమోట్‌ కంట్రోల్‌ రూంలో ఉన్న వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిపై కఠిన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎందుకంటే ఈ హింస కొత్తతరం భవిష్యత్తుపై ప్రభావితం చూపుతుందని...బెంగాల్ ను కొత్తతరం ఆదర్శంగా తీసుకునే విధంగా సురక్షితమైన ప్రదేశంగా మారుస్తామని తెలిపారు.

కాగా ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ 928 జిల్లా పరిషత్‌ స్థానాలు, 9 వేల 419 పంచాయతీ సమితి స్థానాలు, 61 వేల 591 గ్రామ పంచాయతీ స్థానాల్లో పోటీ చేసింది. జిల్లా పరిషత్‌ 897, పంచాయతీ సమితి 7 వేల 32, గ్రామ పంచాయతీ 38 వేల 475 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు