హింసాత్మకంగా బెంగాల్ ఎన్నికల పోలింగ్..అభ్యర్థి ఏజెంట్ కాల్పులు, TMC కార్యకర్త మృతి..!!

పశ్చిమ బెంగాల్‌లో నేడు పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7.30గంటలకు ప్రారంభమైన పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ హుగ్లీ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి జహనారా బేగం ఏజెంట్‌పై కాల్పులు జరిగాయి. ఆరంబాగ్‌లోని అరండి గ్రామ పంచాయతీ 1లోని 273వ బూత్‌లో ఈ ఘటన జరిగింది. ఖయాముద్దీన్ మల్లిక్ అనే ఏజెంట్ ఈ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో టీఎంసీ కార్యకర్త మరణించాడు. బూత్‌కు వెళ్లే సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అటు సీతాయ్‌లో పోలింగ్‌ బూత్‌ను ధ్వంసం చేశారు. అక్కడ బ్యాలెట్ పేపర్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.

New Update
హింసాత్మకంగా బెంగాల్ ఎన్నికల పోలింగ్..అభ్యర్థి ఏజెంట్ కాల్పులు, TMC కార్యకర్త మృతి..!!

హింసాత్మక ఆందోళనలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అనేక హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఉదయం ముర్షిదాబాద్, కూచ్‌బెహార్‌లో జరిగిన హింసలో ఇద్దరు TMC అభ్యర్థులు మరణించగా, గత రాత్రి ముర్షిదాబాద్‌లో ఇద్దరు TMC కార్యకర్తలు మరణించారు. తాజాగా హుగ్లీ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి జహనారా బేగం ఏజెంట్‌పై కాల్పులు జరిగాయి. ఆరంబాగ్‌లోని అరండి గ్రామ పంచాయతీ 1లోని 273వ బూత్‌లో ఈ ఘటన జరిగింది. ఖయాముద్దీన్ మల్లిక్ అనే ఈ వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడ్డాడు. అధికార పార్టీ బూత్‌కు వెళ్లే సమయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో టీఎంసీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు.

west bengal elections

అటు కూచ్‌బెహార్‌లో టీఎంసీ కార్యకర్తను కాల్చి చంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో తుఫాంగుంగ్‌లోని రాంపూర్‌లో టీఎంసీ బూత్ కమిటీ అధ్యక్షుడిని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన నిన్న అర్థరాత్రి జరిగింది. అంతే కాకుండా కూచ్‌బెహార్‌లోని సీతాయ్‌లోని బరావిత ప్రాథమిక పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని ధ్వంసం చేసి బ్యాలెట్‌ పత్రాలకు నిప్పు పెట్టారు దుండగులు.

ఈ ఘటనకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ, “షాకింగ్, విషాదకరమైన సంఘటనలు ఓటింగ్ వర్గాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. రెజీనగర్, తుఫాన్‌గంజ్, ఖర్‌గ్రామ్‌లలో మా పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు మరణించారు.డోమ్‌కోల్‌లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ సమయంలో కేంద్ర బలగాలు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రారంభానికి ముందే ప్రజలకు భద్రత కల్పించడంలో కేంద్ర బలగాలు వైఫల్యమయ్యాని మండిపడ్డారు.

మహ్మద్‌పూర్ నంబర్ 2 ప్రాంతంలోని బూత్ నంబర్ 67, 68 వద్ద కేంద్ర బలగాలను మోహరించే వరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పుర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్ బ్లాక్ 1 నివాసితులు తెలిపారు. ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ లేదు. బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది. చనిపోయిన వారి పేరుతో బోగస్ ఓటింగ్ వేస్తున్నారంటూ ఓటర్లు ఆరోపించారు. సెంట్రల్ ఫోర్స్ ఇక్కడికి వచ్చేంత వరకు మేము ఇక్కడ ఓటు వేయనివ్వమని ఖరాఖండిగా చెబుతున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 22 జిల్లాల్లోని 63,229 గ్రామ పంచాయతీ స్థానాలు, 9,730 పంచాయతీ సమితి స్థానాలు, 928 జిల్లా పరిషత్ స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో బెంగాల్‌లోని 5,67,21,234 (5.7 కోట్లు) ఓటర్లు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. జూలై 11న ఎన్నికల ఫలితాలు రానుండగా.. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ పంచాయతీ ఎన్నికలను అగ్నిపరీక్షగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు