ఉదయాన్నే చెప్పులు లేకుండా గడ్డి మీద నడిస్తే...ఈ వ్యాధులన్నింటికీ చెక్ పెట్టొచ్చు..!! నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యులు మాత్రమే కాదు..మన పెద్దవాళ్లు తరుచుగా గడ్డిపై చెప్పులు లేకుండా నడవాలని చెబుతుంటారు. కానీ అలా ఎందుకు చెబుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? నేటి కాలంలో చెప్పులు లేకుండా బయటకు అడుగు పెట్టడం లేదు. చెప్పులు లేకుండా నడిచే ట్రేండ్ ముగిసింది. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఉదయాన్నే కాళ్లకు చెప్పులు లేకుండా దాదాపు 20 నిమిషాల పాటు గడ్డిపై నడవాలని సూచిస్తున్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు. By Bhoomi 17 Jun 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి చిన్నతనం నుండే, కుటుంబ సభ్యులు ఉదయాన్నే పిల్లలను పార్క్‌లో వాకింగ్‌కి తీసుకెళ్లే అలవాటు చేస్తుంటారు. పచ్చటి గడ్డి మీద పాదరక్షలు లేకుండా నడవాలని మీ ఇంట్లో పెద్దవాళ్లు చెప్పడం చాలాసార్లు వినే ఉంటారు, కానీ నేటి కాలంలో ప్రజలు తమ పనిలో చాలా బిజీగా మారారు. వారు తమ కోసం సమయం కేటాయించుకోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో, గడ్డిలో చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ప్రతిరోజూ 15 నుండి 20 నిమిషాల పాటు గడ్డిపై చెప్పులు లేకుండా నడుస్తే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. గడ్డి మీద మార్నింగ్ వాక్ చేస్తే ఏం లాభం? - రోజూ ఉదయాన్నే గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది. -మీరు అలెర్జీ బాధితులైతే, మీరు గడ్డిపై నడవడం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. -డిప్రెషన్‌తో బాధపడేవారు రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు గడ్డిపై నడవాలి. ఉపశమనం కలుగుతుంది. -మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఉదయాన్నే గడ్డిపై నడవడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. -ఉదయాన్నే గడ్డిలో నడవడం వల్ల ఒత్తిడికి గురి కాకుండా రిలాక్స్‌గా ఉంటుంది. గడ్డిలో చెప్పులు లేకుండా ఎంతసేపు నడవాలి? ఉదయం పూట కనీసం 15 నిమిషాల పాటు గడ్డిపై నడవాలి. మీకు సమయం ఉంటే, మీరు 30 నిమిషాలు నడవండి. ఇది మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడంతోపాటు ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి