Basmati Rice : బాస్మతి రైస్ తింటే.. ఇంత మేలు జరుగుతుందా..!

బాస్మతి బియ్యంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ బియ్యంలో డైటరీ ఫైబర్, థయామిన్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

New Update
Basmati Rice : బాస్మతి రైస్ తింటే.. ఇంత మేలు జరుగుతుందా..!

Basmati Rice Benefits : భారతదేశపు ఆహారం(Indian Food) లో బాస్మతి రైస్(Basmati Rice) చాలా ప్రధానమైనవి. సహజంగా ఈ బాస్మతి బియ్యాన్ని ప్రత్యేక వంటల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రత్యేక రుచి, సువాసనను కలిగి ఈ బియ్యంలో.. ఇనుము, జింక్ , కాల్షియం, డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, థయామిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. బాస్మతి బియ్యంతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

Also Read : Save The Tigers Series : ఓటీటీలో ‘సేవ్‌ ది టైగర్స్‌’ హవా .. ఇండియాలోనే టాప్ 3 సీరీస్ గా రికార్డు..!

బాస్మతి రైస్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Basmati Rice

చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది

బాస్మతి బియ్యంలో తక్కువ గ్లైసెమిక్ విలువలు రక్తంలోని చక్కర స్థాయిలు(Sugar Levels) వేగంగా పెరగడాన్ని తగ్గిస్తుంది. అలాగే వీటిలోని మంచి కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అధిక బరువు

బరువు తగ్గడానికి(Weight Loss) బాస్మతి రైస్ అద్భుతంగా సహాయపడతాయి. ఈ బియ్యంలోని హై డైటరీ ఫైబర్.. ఎక్కువ సమయం వరకు కడుపు నిండుగా ఉందనే భావనను కలిగిస్తుంది. దీంతో శరీరంలో కేలరీ శాతం తగ్గిపోయి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Basmati Rice

మెరుగైన జుట్టు, చర్మం

బాస్మతి బియ్యంలో ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుని ప్రోత్సహించే పోషకాలు ఉంటాయి. వీటిలోని బి విటమిన్స్, జింక్ మెరిసే చర్మం, జుట్టుకు సహాయపడతాయి. అలాగే బాస్మతి బియ్యం అలర్జీలను కూడా దూరం చేస్తుంది.

మెదడు ఆరోగ్యం

బాస్మతీ బియ్యంలో B1, B6 వంటి B గ్రూప్‌ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ B6 (థయామిన్) మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. థయామిన్ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతే కాదు మెదడుకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also Read : Anchor Sreemukhi: శ్రీముఖి రేంజ్ మారింది.. ఏకంగా స్టార్ హీరో సరసన పాన్ ఇండియా మూవీలో..

Advertisment
Advertisment
తాజా కథనాలు