/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T203225.754-jpg.webp)
Steamed Momos : సహజంగా మోమోస్(Momos) ను స్నాక్ గా తింటాము. వీటిలో చాలా రకాలు ఉంటాయి. చికెన్ , వెజ్, చిల్లీ, తందూరీ ఇలా డిఫరెంట్ టైప్ మోమోస్ అందుబాటులో ఉంటాయి. అలాగే వీటిని రెండు మెథడ్స్ లో కుక్ చేస్తారు ఒకటి స్టీమ్డ్, మరొకటి ఫ్రైడ్. చాలా మంది ఫ్రైడ్ మోమోస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కానీ స్టీమ్ పద్దతిలో తయారు చేసినవి ఆరోగ్యానికి చాలా మంచింది. వీటిలో అతి తక్కువ ఫ్యాట్ కంటెంట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడును. స్టీమ్డ్ మోమోస్ తింటే కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి.
స్టీమ్డ్ మోమోస్ తింటే కలిగే ప్రయోజనాలు
- ఆవిరి పద్దతిలో తయారు చేయడం వల్ల వీటిలోని విటమిన్స్ , నియాసిన్, థయామిన్ శాతం పెరుగుతుంది. అలాగే స్టీమింగ్ పద్ధతి ఆహారంలోని పోషకాలు కోల్పోకుండా కాపాడును. ఫ్రైడ్ పద్దతిలో తింటే పోషక విలువలు తగ్గే అవకాశం ఉండును.
- ఫ్రైడ్ మోమోస్ తో పోలిస్తే స్టీమింగ్ పద్దతిలో తయారు చేసే ఆహారాల్లో ఫ్యాట్ కంటెంట్ ఉండదు. స్టీమ్ చేసిన మోమోస్ జీర్ణమవడానికి కూడా సులువుగా ఉంటాయి. డీప్ ఫ్రైడ్ మోమోస్ తింటే కొన్ని సార్లు అజీర్ణ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది.
- స్టీమ్డ్ మోమోస్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఆవిరి పద్దతిలో తయారు చేసినందున శరీరంలో అదనపు కొవ్వుల వినియోగాన్ని తగ్గించును. దీని వల్ల జీవన శైలి వ్యాధులు రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించును.
- వెజిటల్ మోమోస్ లో గ్రీన్ వెజిస్, కూరగాయలు ఉంటాయి. వీటిలోని ఫైబర్ కంటెంట్ రక్తంలోని చక్కర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడును.
- మోమోస్ ఫిలింగ్స్ లో ఉపయోగించే గ్రీన్ వెజిస్, మీట్, మష్రూమ్, టోఫు, పన్నీర్, చీస్ మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. అలాగే వీటి తయారీ కోసం ఉపయోగించే thieves ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండును. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించడానికి తోడ్పడును. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచును.