Coriander Water: ధనియాల నీళ్లు తాగితే.. శరీరంలో అవి తగ్గిపోతాయి..!

ఉదయాన్నే ధనియాలు మరిగించిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడతాయి. ధనియాల్లోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు దురద , దద్దుర్లు, గజ్జి వంటి చర్మ సమస్యలను కూడా దూరం చేస్తాయి.

New Update
Coriander Water: ధనియాల నీళ్లు తాగితే.. శరీరంలో అవి తగ్గిపోతాయి..!

Coriander Water: సాధారణంగా ధనియాలు వంటల్లో ఒక స్పైస్ లా వాడుతుంటారు. ఇవి వంటకానికి మంచి సువాసన, రుచిని అందిస్తాయి. అయితే ధనియాలు కేవలం వంటకాల్లో మాత్రమే ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. రోజూ ఉదయాన్నే ధనియాలు మరిగించిన నీటిని తాగితే కొలెస్ట్రాల్, మధుమేహం, జీర్ణక్రియ సమస్యల పై మంచి ప్రభావం ఉంటుంది. ధనియాల నీటితో కలిగే మరిన్ని లాభాలేంటో తెలుసుకుందాము..

  • మధుమేహంతో బాధపడుతున్న వారికి ధనియాల రసం అద్భుతమైన చిట్కా. ప్రతీ రోజూ ఉదయాన్నే ధనియాలు మరిగించిన నీళ్లను తాగితే రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
  • ధనియాలలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఈ నీటిని తాగడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అంతే కాదు నోటిలోని బాక్టీరియా, క్రిములను అంతం చేసి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • ధనియాల నీళ్లు శరీర నిర్విషీకరణలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో హానికర టాక్సిన్స్ ను నిర్మూలించి .. లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అంతే కాదు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రమాదకరమైన వ్యాధులను కారణమయ్యే ఆక్షీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

publive-image

  • జీర్ణక్రియ సమస్యలతో భాదపడుతున్నవారు ఉదయాన్నే ధనియా వాటర్ తాగితే మంచి ప్రభావం ఉంటుంది. గ్యాస్, కడుపుబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • ధనియాల్లోని యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు.. గజ్జి, దురద, దద్దుర్లు, వాపులు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
  • ధనియాలు మరిగించిన నీళ్లలో కాస్త బెల్లం లేదా తేనే కలిపి తాగడం ద్వారా పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పుట్టుమచ్చల్లో ఈ మార్పులు క్యాన్సర్‌కి సంకేతాలు కావచ్చు.. అవేమిటంటే..!!

Advertisment
తాజా కథనాలు