Ashes: నువ్వు దేవుడివి సామీ.. ఏకంగా సోబర్స్,కలీస్ సరసనే నిలిచిపోయావుగా..! యాషెస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో 6 వేల పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6,008 పరుగులు.. 197 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో జాక్ కలీస్ (13,289 పరుగులు.. 292 వికెట్లు).. గ్యారీ సోబర్స్ (8,032 పరుగులు, 235 వికెట్లు) ముందున్నారు. By Trinath 08 Jul 2023 in Scrolling స్పోర్ట్స్ New Update షేర్ చేయండి టెస్టుల్లో అతని ఆట ప్రత్యేకం.. పరిస్థితికి తగ్గట్టుగా ఆడడం అతని నైజం.. బజ్‌బాల్ క్రికెట్ ఊపులోనూ ఆచితూచీ ఆడగల సమర్థడు అతను. ఇంగ్లండ్ జట్టును ముందుండి నడిపిస్తున్న పోటుగాడతను. యాషెస్ తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆట గురించి క్రికెట్ అభిమానుల మధ్య విపరీతంగా చర్చ జరిగింది. విలక్షణ బ్యాటింగ్‌తో..టీమ్ అంతా కుప్పకులుతున్నా.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ మంచి బంతులను వదిలేస్తూ స్టోక్స్ ఆడిన తీరు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది. తాజాగా జరుగుతున్న మూడో టెస్టులోనూ బెన్ స్టోక్స్ ఒంటిరిపోరాటం అభిమానుల మదిని గెలిచింది. అంతేకాదు.. తొలి ఇన్నింగ్స్ ప్రదర్శనతో స్టోక్స్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. సోబర్స్, కలిస్‌కే సాధ్యమైన రికార్డు: కాంపిటేటివ్ క్రికెట్‌లో ఒకే ఓవర్లలో 6సిక్సులు కొట్టిన మొదటి ప్లేయర్ సర్ గ్యారీ సోబర్స్. బౌలర్లను చీల్చిచెండాడే సోబర్స్ అటు బౌలర్‌గానూ అద్భుతంగా రాణించాడు. ఇటు ఆల్‌రౌండర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం దక్షిణాఫ్రికా లెజండరీ ప్లేయర్ జాక్వస్ కలీస్. అసలు ఆల్‌రౌండర్ల గురించి చర్చ వస్తే అందలో కలీస్ ప్రస్తావన లేకుండా ఆ సంభాషన ముగియదు. అలాంటి ఇద్దరి దిగ్గజాలకు సాధ్యమైన రికార్డు బెన్ స్టోక్స్ ఖాతాలో వచ్చి పడిందంటే ఈ జనరేషన్ టెస్టు ఫార్మాట్‌లో అతను ఎంతటి విలువైన ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. తొలి టెస్టు రెండో రోజు ఆటలో 80 పరుగులతో మెరిసిన స్టోక్స్ టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయి మార్క్‌ని అందుకున్నాడు. టెస్టుల్లో 6 వేల పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6,008 పరుగులు.. 197 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో జాక్ కలీస్ (13,289 పరుగులు.. 292 వికెట్లు).. గ్యారీ సోబర్స్ (8,032 పరుగులు, 235 వికెట్లు) ముందున్నారు. Back-to-back SIXES! 🚀 Our captain. Our Ben Stokes. 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/nGhVAZC6ij — England Cricket (@englandcricket) July 7, 2023 హోరాహోరీగా మూడో టెస్టు: తొలి రెండు టెస్టుల్లో ఓటమితో ఇంగ్లండ్‌కి చావోరేవోగా జరుగుతున్న మూడో టెస్టులో రెండు జట్ల మధ్య ఆధిపత్యం దోబూచులాడుతోంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 116పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఉన్నారు. ప్రస్తుతం 142పరుగులు లీడ్‌లో ఉన్న ఆసీస్ నిలకడగా ఆడి భారీ స్కోర్ చేస్తుందా లేదా.. 250పరుగుల లోపే ఆలౌట్ అవుతుందా అన్నదానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్‌లో 26పరుగుల ఆధిక్యం సంపాదించిన కంగారులు.. 250పరుగులు లోపు ఆలౌట్ అయితే మాత్రం ఇంగ్లండ్ మూడో టెస్టు గెలిస్తుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అలా కాకుండా భారీ స్కోర్ చేస్తే మాత్రం ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేస్తారంటున్నారు. ఎందుకంటే బజ్‌బాల్ స్టైల్ అనుసరిస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్లు హిట్టింగ్ చేసే క్రమంలో వికెట్లు కోల్పోతారని జోస్యం చెబుతున్నారు. తొలి రెండు టెస్టుల్లో కూడా అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు స్టోక్స్ మినహా మిగిలిన బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతుండడం ఇంగ్లండ్ టీమ్‌ని కలవరపెడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా తమ జట్టు ఆటగాళ్లు గాడిన పడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి