Tyson Naidu: 'టైసన్ నాయుడు' గా రాబోతున్న.. బెల్లంకొండ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా బెల్లంకొండా శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర బృదం ఈ సినిమా అఫీషియల్ టైటిల్ ప్రకటించారు. "టైసన్ నాయుడు" టైటిల్ ఖరారు చేస్తూ.. సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. By Archana 03 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tyson Naidu: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Sreenivas Bellamkonda) ప్రస్తుతం కెరీర్ లో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను రీమేక్ చేసి.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ డిజాస్టర్ అందుకున్నారు. తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ.. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో లేటెస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. Also Read: Tripti Dimri: కొత్త నేషనల్ క్రష్‌కి కొత్త బాయ్‌ఫ్రెండ్.. మరి అనుష్క తమ్ముడి సంగతేంటి? ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సినిమా అఫీషియల్ టైటిల్ ప్రకటించారు."టైసన్ నాయుడు" (Tyson Naidu) టైటిల్ ఖరారు చేస్తూ.. సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ పాత్రలో నటించారు. యాక్షన్ సన్నివేశాలతో సినిమా గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి హీరో తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టర్ షేర్ చేశారు. "ఈ పూర్తి యాక్షన్ చిత్రాన్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉందని పోస్ట్ లో తెలిపారు." 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Sreenivas bellamkonda (@sreenivasbellamkonda) Also Read: Mani Sharma: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఆఫర్స్ ఇవ్వట్లేదు.. మణిశర్మ షాకింగ్ కామెంట్స్..! #tyson-naidu #sreenivas-bellamkonda-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి