Kedaranath: ఆర్మీ ఛాపర్‌ నుంచి జారిపడ్డ హెలికాఫ్టర్‌!

కేదార్‌నాథ్‌ లో కొద్ది రోజుల క్రితం ఓ క్రెస్టల్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సమయంలో దెబ్బతింది. దానిని తరలించేందుకు ఆర్మీ ఎంఐ-17 ఛాపర్‌ ను తెప్పించారు. దానిని తీసుకుని వెళ్లే క్రమంలో ఎంఐ -17 హెలికాప్టర్‌ కు అమర్చిన తీగలు తెగిపోయాయి.కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి కొండ పై పడిపోయింది.

New Update
Kedaranath: ఆర్మీ ఛాపర్‌ నుంచి జారిపడ్డ హెలికాఫ్టర్‌!

Kedaranath: కేదార్‌నాథ్‌ లో కొద్ది రోజుల క్రితం ఓ క్రెస్టల్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సమయంలో దెబ్బతింది. దీనిని తరలించేందుకు సైన్యం రంగప్రవేశం చేసింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్‌ ను తెప్పించారు. దీనికి ప్రత్యేకమైన కేబుల్స్‌ తో క్రెస్టల్‌ హెలికాప్టర్‌ ను కట్టి దానిని ఈ ఉదయం తీసుకుని వెళ్లేందుకు అంతా సిద్దం అయ్యింది.

కొంత దూరం ప్రయాణించిన వెంటనే కేదార్‌ నాథ్‌- గచౌర్‌ మధ్య బీంబాలి ప్రాంతంలో ఎంఐ -17 హెలికాప్టర్‌ కు అమర్చిన తీగలు తెగిపోయాయి. కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్‌ హెలికాప్టర్‌ కొండ పై పడిపోయింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

ఇటీవల ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాల కారణంగా కేదార్ నాథ్‌ యాత్రను ఆగస్టులో నిలిపేశారు. దీంతో యాత్రికులు వాయుమార్గంలో ఇక్కడికి వస్తున్నారు. ఈ క్రెస్టల్‌ హెలికాప్టర్‌ ను యాత్రికులను తరలించేంఉదకు వినియోగించేవారు.

మరో పక్క వర్షాల కారణంగా గౌరీకుండ్‌- కేదార్‌ నాథ్‌ ల మధ్య చిక్కుకుపోయిన వేలాది మంది యాత్రికులను రక్షించేందుకు సైన్యం, వాయుసేన, చినూక్‌, ఎంఐ 17 హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి.

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు