New Car: దీపావళికి కారు కొంటున్నారా? డెలివరీ సమయంలో ఇలా చేయడం తప్పనిసరి 

కొత్త కారు కొన్నపుడు కారు డెలివరీ సమయంలో PDI అంటే ప్రీ డెలివరీ ఇన్స్ పెక్షన్ తప్పనిసరిగా చేయాలి. లేకపోతె తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

New Update
New Car:  దీపావళికి కారు కొంటున్నారా? డెలివరీ సమయంలో ఇలా చేయడం తప్పనిసరి 

New Car:  భారతదేశంలో పండుగల దేశం. చాలా పండగలు మన దేశంలో ఉన్నాయి. ఏ పండుగ ప్రాధాన్యత దానిదే. దేని విశిష్టత దానిదే. ఒక్కో పండుగకు ఒక్కోరకమైన విశేషం ఉంటుంది. దీపావళి పండుగకు చాలా విశిష్టతలు ప్రత్యేకతలు ఉన్నాయి. దీపావళి పండుగ రోజున బాణాసంచా కాల్చడం ఒక్కటే కాదు.. బంగారం.. కొత్త వస్తువులు కొనే సంప్రదాయం కూడా ఉంది. బంగారం తరువాత ఎక్కువగా కార్లు లేదా బైక్ లు కొంటుంటారు. మీరు కూడా దీపావళికి కారు కొనాలని అనుకుంటున్నారా? కారు డెలివరీ తీసుకోబోతున్నారా? అయితే, ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. కారు డెలివరీ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.. బోలెడు ఖరీదు పెట్టి కొనే కారును(New Car) డెలివరీకి ముందే అన్నిరకాలుగాను డీలర్ వద్ద చెక్ చేసుకోవాలి. దీనినే PDI అంటే ప్రీ డెలివరీ చెక్ అంటారు. ఇప్పుడు కారు తీసుకునేముందు డీలర్ దగ్గర కారును ఏ అంశాలలో చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 

New Car డెలివరీ తీసుకునే ముందు ఏఏ అంశాలను చెక్ చేయాలో ముందుగా ఒక చెక్ లిస్ట్  సిద్ధం చేసుకోండి. ఈ లిస్ట్‌లో, ఇంజిన్, ఎక్ట్సీరియర్, ఇంటీరియర్, టైర్లు, ఫీచర్లు, కారు పెయింట్ వంటి కార్లో చెక్ చేయాల్సిన ప్రతి పాయింట్‌ను నోట్ చేసుకోండి. ఈ లిస్ట్ ఎందుకంటే, కారును చెక్ చేసే సమయంలో ఏ విషయాన్ని మర్చిపోకుండా ఉండవచ్చు. 

కారు బయటవైపు ఇలా.. 

  • కారు(New Car) చుట్టూ తిరిగి అందులో ఏవైనా గీతలు లేదా డెంట్‌లు ఉన్నాయా అని చూడండి. కారు బంపర్‌లు అన్ని  వైపులా ప్రత్యేక శ్రద్ధ వహించండి. సాధారణంగా డీలర్లు చిన్న చిన్న గీతలు దాచడానికి కారును పాలిష్ చేస్తారు. ఒకటి లేదా రెండు సార్లు కడిగిన తర్వాత ఈ గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇటువంటివి చెక్ చేయడం కోసం కారు మొత్తం చేతితో తడిమి చూడండి. ఎక్కడైనా ఇటువంటి పాలిష్ పని జరిగి ఉంటె చేతికి ఆ తేడా తెలుస్తుంది. ఇక కారును ఒక పక్క నుచి జాగ్రత్తగా చూస్తే కూడా ఎక్కడన్నా రీ పెయింట్ చేస్తే తేడా కనిపిస్తుంది. 
  • ఎక్కువ సేపు కారు(New Car) పార్క్ చేస్తే టైర్లు ఫ్లాట్ అవుతాయి. కొత్త కారు టైర్లు కూడా ఒక్కోసారి పాడయి ఉండవచ్చు. అందుకే నాలుగు టైర్లు, రిం, అల్లాయ్ వీల్ ను చెక్ చేయండి. అలాగే కారుతో ఇస్తున్న జాక్ ఇతర పరికరాలను చెక్ చేసుకోండి. 

కారు లోపలి వైపు ఇలా.. 

  • కారు (New Car)లోపల, డాష్‌బోర్డ్, సీట్లు, గ్లోవ్‌బాక్స్‌ని పూర్తిగా చెక్  చేయండి.
  • ఫ్లోర్ మ్యాట్ తొలగించి కార్పెట్‌లో తేమ లేదా ధూళి ఉందా అని చెక్  చేయండి.
  • అలాగే కారు అద్దాలు అన్నింటిలో పగుళ్లు లేదా గీతలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. 
  • కారులోని అన్ని స్విచ్‌లను తనిఖీ చేయండి. అవి సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అనేది చూడండి.
  • ఎయిర్ కండీషనర్ (AC) ఆన్ చేసి, క్యాబిన్ త్వరగా చల్లబడుతుందో లేదో చూసుకోండి. 

Also Read: ఈవారం స్టాక్ మార్కెట్ జోరు కొనసాగుతుందా? అంచనాలు ఎలా ఉన్నాయి?

ఇంజిన్, ఓడోమీటర్.. 

  • కారు (New Car)బానెట్‌ని తెరిచి, దాని ఫ్యూయల్స్ లవ్=లెవెల్స్ చెక్  చేయండి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్ అలాగే విండ్ స్క్రీన్ వాషింగ్ ఫ్లూయిడ్ తప్పనిసరిగా పూర్తిగా ఉండాలి. 
  • ఇంజిన్‌ను ఆన్ చేసి కాసేపు అలానే వదిలేయండి. ఏవైనా లీక్‌ల కోసం బానెట్ కింద తనిఖీ చేయండి లేదా ఏదైనా అసాధారణ శబ్దాలు లేదా వైబ్రేషన్‌లు వస్తున్నాయేమో చూసుకోండి. 
  • ఇది కాకుండా, యాక్సిలరేటర్ పెడల్‌పై మీ పాదాలను ఉంచి, రెండు-మూడు ఏక్సిలేట్ చేసి ఇంజిన్ శబ్దాన్ని వినండి. ఇంజిన్ నుంచి నల్లటి పొగ రావడం లేదని నిర్ధారించుకోండి. 
  • కొత్త కారు ఓడోమీటర్ రీడింగ్ 30-50 కిమీ కంటే ఎక్కువ ఉండకూడదు. రీడింగ్ 30-50 కిమీ కంటే ఎక్కువ ఉంటే, దాని గురించి డీలర్‌తో మాట్లాడండి.
  • డీలర్లు వినియోగదారులకు 5 లీటర్ల కాంప్లిమెంటరీ ఫ్యూయల్ ఇస్తారు. ఫ్యూయల్ సరిగ్గా ఇచ్చారో లేదో చూసుకోండి. దగ్గరలో ఉన్న పెట్రల్ పంపు వద్దకు వెళ్ళడానికి సరిపడే ఫ్యూయల్ ఉందొ లేదో చూసుకోండి. 

కారు డాక్యుమెంట్స్ 

  • రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ కవర్, మాన్యువల్‌లు, వారంటీ కార్డ్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ నంబర్ మరియు సర్వీస్ బుక్ వంటి అన్ని కాగితాలను తనిఖీ చేయండి.
  • డీలర్ నుంచి  'ఫారం 22'ని తనిఖీ చేయాలని నిర్ధారించుకోండి, ఇందులో కారు ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్, కారు తయారీ నెల, సంవత్సరం గురించిన సమాచారం ఉంటుంది.
  • డీలర్ అందించిన పత్రాలతో వాహనం గుర్తింపు సంఖ్య (VIN), ఇంజిన్ నంబర్, కారు ఛాసిస్ నంబర్ సరిపోలుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. 

మీరు కారు(New Car) తీసుకునే సమయంలో  PDI తప్పకుండ చేసుకోవాల్సిందే. పైన చెప్పిన అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే, ఒక్కసారి కారు డెలివరీ తీసుకున్నాక అందులో ఏ ఒక్క లోపే వచ్చినా దానికి డీలర్ బాధ్యత వహించడు. షోరూం నుంచి కారు తీసుకుని ఒక్క కిలోమీటర్ వెళ్లిన తరువాత ఇబ్బంది వచ్చినా డీలర్ బాధ్యత తీసుకోడు. అందువల్ల కచ్చితంగా అన్ని విషయాలు పరిశీలించడం అవసరం. కష్టపడి కొనుక్కున్న కారు కొన్న వెంటనే లోపాలు కనిపిస్తే ఎంత ఇబ్బంది. అందుకే ముందుగానే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ డీలరు PDI కోసం అంగీకరించకపోతే, ఆ కారు(New Car)లో కచ్చితంగా ఎదో లోపం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అటువంటి పారిస్తాటిలో కారు తీసుకోబోమని డీలర్ కు స్పష్టంగా చెప్పవచ్చ్చు. PDIలో ఏదైనా పెద్ద సమస్య ఉన్నట్లయితే, అటువంటి కారుని కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఇది భవిష్యత్తులో మీ జేబును ఖాళీ చేయకుండా ఉంటుంది. 

Watch this special video:

Advertisment
Advertisment
తాజా కథనాలు