Beetroot Face Pack: బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌కి బెస్ట్‌ రూట్‌..ఒక్కసారి ట్రై చేయండి

అందమైన ముఖాన్ని పొందడానికి చాలా మంది కష్టపడతారు. ఇందుకోసం వారు అనేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. బీట్‌రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ ఎలాంటి వేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Beetroot Face Pack:  బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌కి బెస్ట్‌ రూట్‌..ఒక్కసారి ట్రై చేయండి

Beetroot Face Pack: ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. దానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. రకరకాల క్రీములు రాస్తారు. వాటికి బదులుగా బీట్‌రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ నుంచి ఫేస్ ప్యాక్ చాలా బాగా పని చేస్తుంది. బీట్‌రూట్‌ ఎలా తయారు చేసుకోవాలి..?, బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బీట్‌రూట్‌ ముఖానికి రాస్తే కాలిగే ప్రయోజనాలు:

  • అందమైన ముఖాన్ని పొందడానికి చాలా మంది కష్టపడతారు. ఇందుకోసం వారు అనేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. మీరు కూడా అందంగా కనిపించాలని కోరుకుంటే, ఒక్కసారి బీట్‌రూట్‌ని వాడి చూడండి. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేయటంలో బీట్‌రూట్ బెస్ట్‌ అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ముఖంపై మచ్చలు, మొటిమలను కూడా తగ్గిస్తుంది.
  • బీట్‌రూట్ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించడం ద్వారా కూడా ముఖంపై ఉన్న నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. ఇది ముడతలను తగ్గిస్తుంది, చర్మాన్ని తేమ చేస్తుంది. దీనిని వలన చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంటుంది.
  • వేసవిలో బీట్‌రూట్‌ని ఉపయోగించడం ద్వారా ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. బీట్‌రూట్ ఆహారంలోనే కాదు ముఖానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది.
  • బీట్‌రూట్‌ను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి.. ముందుగా ఒక చెంచా బీట్‌రూట్‌, పెరుగును కలిపి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మెడ, ముఖానికి అప్లై చేసిన తర్వాత 20 నిమిషాలకు చల్లిని నీటితో కడగాలి. ఈ విధంగా బీట్‌రూట్, పెరుగుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.
  • కొందరి చర్మం భిన్నంగా ఉంటుంది. బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ కొందరికి పడుతుంది, కొంతమందికి పడదు. అందుకే దీన్ని అప్లై చేసేటప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే.. వెంటనే ఒకసారి డాక్టర్లను సంప్రదించాలని చర్మ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: జుట్టు రాలడాన్ని తగ్గించే క్యారెట్లు..చుండ్రు కూడా ఉండదు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు