ఏజ్ పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు(Wrinkles) పడడం సహజమే. అయితే ఏజ్ పెరిగినా యంగ్‌గా ఉండాలని ఆలోచించేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటారు. యాజ్ పెరిగిన విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా జాగ్రత పడుతుంటారు. కానీ ఎంత దాచినా పెరిగిన ఏజ్ దాగదు. అయితే కొన్ని చిట్కాలు మాత్రం మనల్ని నిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. 60ల్లో 20ల్లో ఉన్నట్టు కనిపించడం అనేది నిజం కాదు. అది వ్యాపార సంస్థలు చెప్పే కబుర్లు మాత్రమే.. ఐనప్పటికీ కాస్త యంగ్‌గా కనిపించేలా, అనిపించేలా చేసే చిట్కాలు ఉంటాయి.
హైడ్రేటెడ్‌గా ఉండండి: మంచి నీరు ఎక్కువగా తాకడం అన్నది అనేక సమస్యలకు చిట్కా. ఇది ఫాలో అయితే చాలా సమస్యలు తీరిపోతాయి. బాడీ ఇన్‌సైడ్ ప్రాబ్లెమ్స్‌తో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్‌ని కూడా క్లీయిర్ చేసే చిట్కా ఇది. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఫేస్ ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముడతల సమస్య కూడా తగ్గుతుంది.
బాగా నిద్రపోండి: మీ చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడటానికి ప్రతి రాత్రి 7-9 గంటల నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. నిద్రలేమి ఫేస్‌ని పాడు చేస్తుంది. అంతేకాదు అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది.
ధూమపానం, మద్యపానం వద్దు: ధూమపానం, అధిక మద్యపానం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. అంటే తక్కువ ఏజ్‌లోనే ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనిపిస్తాం. ఇది అసలు మంచిది కాదు. సిగరెట్లు అదేపనిగా తాగడం వల్ల లీవర్‌తో పాటు స్కిన్ కూడా పాడవుతుంది. చాలామంది మద్యపానం వల్ల కలర్ వస్తారని చెబుతుంటారు. ఇది నిజం కాదు.
ఒత్తిడి: అధిక ఒత్తిడి స్థాయిలు ముడతలకు దోహదం చేస్తాయి. కాబట్టి ఒత్తిడి నిర్వహణ పద్ధతులను పాటించండి. ఏ విషయంలోనూ స్ట్రెస్ తీసుకోవద్దు. అతిగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోవద్దు. ఎందుకంటే ఇవి పరోక్షంగా మన ముఖంపై ప్రభావాన్ని చూపిస్తాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలి: సాధారణ వ్యాయామంతో సహా ఆరోగ్యకరమైన జీవనశైలి యవ్వన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. బయట ఏది పడితే అది తినవద్దు. టైమ్‌కి తినడం అలవాటు చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, ఏది పడితే అది తినడాన్ని మానుకోండి.
వేడి నుంచి రక్షణ: వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. వేడి ప్లేస్‌లో ఎక్కువ సమయం ఉండకుండా ఉండేలా చూసుకోండి. ఎక్కువ ఎండ తగులుతుంటే ముఖం పాడవుతుంది. అలాగని సూర్యుడిని తప్పించుకోని తిరగవద్దు. మనకు వీటమిన్-డీ కూడా చాలా అవసరం. చాలా మంది అసలు బయటకే రాకుండా ఉంటారు. ఇది అసలు కరెక్ట్ కాదు. సాయంత్రం వేళలో మంచి ఎండ కాస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.
ఆహారం: మీ చర్మం దెబ్బతినకుండా కాపాడుకోవడానికి పండ్లు, కూరగాయలు లాంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
ALSO READ: ఈ హెయిర్ టిప్స్ పాటించండి.. మీ జుట్టును చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వకపోతే అడగండి..!