Black Heads: బ్లాక్‌ హెడ్స్‌కి చెక్‌ పెట్టే చిట్కాలు.. ఇవి ఫాలో అవ్వండి చాలు..!

బ్లాక్‌ హెడ్స్‌.. ఒక రకమైన మొటిమలు, తరచుగా ముఖం, ఛాతీ, వెనుక భాగంలో వస్తాయి. ఇవి పోవాలంటే చెమట పట్టిన తర్వాత వీలైనంత త్వరగా చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. వీక్లీ క్లే మాస్క్‌లు బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్‌హెడ్స్ కొనసాగితే చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

Black Heads: బ్లాక్‌ హెడ్స్‌కి చెక్‌ పెట్టే చిట్కాలు.. ఇవి ఫాలో అవ్వండి చాలు..!
New Update

చాలామందిని బ్లాక్‌ హెడ్స్‌(Black heads) సమస్య బాధపెడుతుంటుంది. బ్లాక్‌ హెడ్స్‌ పోవాలని ఫేస్‌పై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కెమికల్స్‌ ఎక్కువగా వాడడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌ సమస్య తీరకపోగా ముఖం పాడవుతుంది. ఇది అసలు మంచిది కాదు. బ్లాక్ హెడ్స్ చర్మంపై చిన్న, నల్లటి మచ్చలు. ఫోలికల్ (రంధ్రం) తెరవడంలో ఒక చిన్న ప్లగ్ వల్ల ఇవి సంభవిస్తాయి. బ్లాక్ హెడ్స్‌ను ఓపెన్ కామెడోన్స్ అని కూడా అంటారు.

బ్లాక్‌ హెడ్స్ సమస్య పోవాలంటే అందుకే కొన్ని మార్గాలున్నాయి. కానీ అదే పనిగా ఫేస్‌పై ప్రయోగాలు చేయవద్దు. ఇది వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఇక బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి ఈ టిప్స్ పాటించండి.

⁍ స్కిన్‌ని క్లీన్‌గా ఉంచండి: నాన్-కామెడోజెనిక్ క్లెన్సర్‌తో మీ ముఖాన్ని ప్రతిరోజూ రెండుసార్లు కడగాలి. మీ ఫేస్‌పై అదనపు ఆయిల్ పేరుకుపోయి ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడానికి ఫేస్‌ని శుభ్రంగా ఉంచుకోండి.

⁍ ఎక్స్‌ఫోలియేట్: సాలిసిలిక్‌ని ఉపయోగించండి. దీన్ని అతిగా చేయవద్దు. ఎందుకంటే అధిక ఎక్స్‌ఫోలియేషన్ చర్మాన్ని చికాకుపెడుతుంది.

⁍ ఆయిల్-ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించండి: మేకప్, మాయిశ్చరైజర్లు, సన్‌స్క్రీన్‌లను ఎంచుకోండి.

⁍ నిపుణుల సహాయాన్ని కోరండి: బ్లాక్‌హెడ్స్ కొనసాగితే చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

⁍ స్క్వీజ్ చేయవద్దు: మీ వేళ్లతో బ్లాక్‌హెడ్స్‌ను పిండడం మానుకోండి. దీని వల్ల చర్మం దెబ్బతింటుంది. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

⁍ క్లే మాస్క్‌లు: వీక్లీ క్లే మాస్క్‌లు అదనపు నూనెను గ్రహిస్తాయి. బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

⁍ ఆవిరి: రంధ్రాలను తెరవడానికి మీ ముఖాన్ని కొన్ని నిమిషాలు ఆవిరి చేయండి. ఇది చాలా మేలు చేస్తుంది.

⁍ బ్రష్: స్కిన్‌ కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ బ్రష్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. సబ్బు, నీటి కంటే మేకప్ తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది.

చెమట పట్టిన తర్వాత వీలైనంత త్వరగా చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి.

బెంజాయిల్ పెరాక్సైడ్.. ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

ALSO READ: ఇలాంటి లవర్‌ ఉంటే తలపోటు తప్పదు.. అయినా నో టెన్షన్‌..ఈ టిప్స్‌ పాటించండి..!

#beauty-tips-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe