Beauty Tips:సెలబ్రిటీలు ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఒకసారి ట్రై చేసి చూడండి!

మహిళలు ఎక్కువగా మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. హీరోయిన్లులాగా అందంగా కనిపించాలని భావిస్తుంటారు. దాని కోసం బ్యూటీ ప్రొడెక్ట్స్‌ని తెగ కొంటుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మంచి నీరు ఎక్కువగా తాగడం, సరిపడా నిద్రపోవడం, ఐస్ క్యూబ్స్, సన్ స్క్రీన్, హైడ్రేటింగ్ మాస్క్ లాంటి వాటితో నేచురల్‌గానే అందంగా కనిపంచవచ్చు.

New Update
Beauty Tips:సెలబ్రిటీలు ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఒకసారి ట్రై చేసి చూడండి!

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అమ్మాయిలు మరింత ఎక్కువగా భావిస్తారు. అందం కోసం రకరకాల కాస్మోటిక్స్‌ వాడుతుంటారు. అయితే అవి అంత మంచివి కావు. లాంగ్‌ టర్మ్‌లో చర్మానికి ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హీరోయిన్లు కూడా మేకప్‌ వాడుతారు కదా.. కానీ చాలా మంది నేచురల్‌గా కూడా అందంగా ఎలా ఉంటారని..? ఎందుకంటే వాళ్లు నేచురల్‌గా ఉండే కాస్మోటిక్‌ ప్రొడక్ట్స్‌నే వాడుతారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సెలబ్రెటీలు ఓకే చేసిన 5 బ్యూటీ సీక్రెట్స్‌పై ఓ లుక్కేయండి

ఐస్ క్యూబ్స్:
ఇది నమ్మినా నమ్మకున్నా నిజం.. ఐస్ క్యూబ్స్‌తో అనేక ప్రయోజనాలుంటాయి. ముఖానికి ఐస్‌ క్యూబ్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. బాలీవుడ్ తారలు సైతం ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పుకొచ్చారు.. ఐస్‌ క్యూబ్స్‌ని పాలు లేదా కలబందతో కలిపి తీసుకోవాలి.. ఇది నేచురల్‌ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.

హైడ్రేటింగ్ మాస్క్:
చాలామంది మేకప్‌ తీసిన తర్వాత హైడ్రేటింగ్‌ మాస్క్‌ని ఉపయోగిస్తారు. దాని అప్లై చేసి పడుకుంటారు. మేకప్‌ లేకుండా కూడా మెరిసే అందం మీ సొంతం అవ్వాలంటే హైడ్రేటింగ్‌ మాస్క్‌ వేసుకోవాలి. పెరుగు, అవోకాడోను ఉపయోగించి ఇది తయారు చేసుకోవచ్చు.

సన్ స్క్రీన్:
ఎండలో బయటకు వెళ్తేనే సన్‌ స్క్రీన్‌ ఉపయోగించాలని చాలా మంది అనుకుంటారు. ఇది సరైన భావన కాదు. ఎక్కువగా వేడిగా ఉండే ఇండియా లాంటి దేశాల్లో ప్రొటెక్షన్‌ కోసం సన్‌ స్క్రీన్‌ని ఉపయోగించడం చాలా అవసరం. ఎందుకంటే మన చర్మంపై ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా యూవీ కిరణాల ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే సన్‌ స్క్రీన్‌ వాడడం తప్పనిసరి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

తగినంత నిద్ర:
రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. సరిపడా నిద్ర మన చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ లైఫ్‌లో మునిగిపోయి ఉంటాం. అందుకే కచ్చితంగా నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ముఖంపై ముడతలు కూడా పడుతాయి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

మంచి నీరు:
నీరు తాగితే హైడ్రెటెడ్‌గా ఉంటాం. మంచి నీరు మనకు ఎంతో అవసరం. నీళ్లు ఎక్కువ తాగితే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. ప్రతిరోజూ 4 లీటర్ల నీరు తాగాలి.ఎంత హైడ్రెటెడ్‌గా ఉంటే అంత అందంగా కనిపిస్తాం అని తెలుసుకోవాలి.

ALSO READ: ఈ ఐదు డ్రెస్సులు అమ్మాయిల ఫేవరెట్.. అబ్బాయిలు చూపు తిప్పుకోలేరు బాసూ!

Advertisment
Advertisment
తాజా కథనాలు