Beauty Tip: గోళ్లు ఆరోగ్యంగా.. అందంగా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసా? గోళ్ల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లలో క్రీములు, బ్యాక్టీరియా చేరుతుంటాయి. దీంతో అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అలివ్ నూనెతో మసాజ్ చేయడం, నాణ్యమైన గోళ్ల రంగులు వేసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. By Vijaya Nimma 23 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Beauty Tip: గోళ్లు కాళ్లు, చేతుల అందాన్ని పెంచుతాయి. అందంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడతారు. ముఖం, కాళ్లు, చేతులు వీటన్నిటికీ ఎంతో డబ్బు ఖర్చు చేసి బ్యూటీ వస్తువులు ఉపయోగిస్తారు. కొంతమంది గోళ్లకు ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటారు. అంతేకాదు ఖరీదైన గోళ్ల రంగు, నెయిల్ ఆర్ట్స్‌ని నచ్చినట్లుగా వేసుకుంటారు. అయితే ఇవన్నీ గోళ్లకు కొత్త అందాన్ని ఇస్తాయి. గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేక కేర్ తీసుకోవాలి. దీనివల్ల గోళ్లు ఆరోగ్యంతోపాటు అందంగా ఉంటాయి. దీని కోసం ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం... ఇంట్లో పనులు చేసే గోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే పనిచేసినప్పుడు గోళ్లు తడిగా ఉంటాయి. దానిలో క్రీములు, బ్యాక్టీరియా చేరుకునే అవకాశం ఉంది. అందుకని పనులు చేశాక తడి పోయేలా గోళ్లు తుడుచుకోవాలి. కొందరిలో గోళ్లు కొరకే అలవాటు ఉంటుంది. లాలాజలం తడివల్ల గోర్లు బలహీనపడి చిట్టినట్లు అవుతుంది. ఇది గోళ్ల చుట్టు ఉన్న చర్మానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడి ఉన్నా గోర్లను కోరడం మానుకోవాలి. అంతేకాకుండా గోళ్లు పొడిబారినప్పుడు అవి విరిగిపోతాయి. ఈ సమస్య తగ్గించాలంటే చేతులతోపాటు గోళ్లకు నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని రాయాలి. అలివ్ నూనెతో మసాజ్ చేయాలి. గోళ్ల రంగుల్లో సల్ఫేట్ ఉంటే గోళ్లకు, చుట్టూ ఉన్న చర్మానికి హాని చేస్తుంది. అందుకే నాణ్యమైన గోళ్ల రంగులు ఎంచుకుని వేసుకుంటే ఎలాంటి సమస్యలు రావని చర్మ నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఇలా చేస్తే శరీరం నుంచి వచ్చే చెమట వాసన పరార్! #beauty-tip మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి