Lip Care: సాఫ్ట్‌గా, పింక్ కలర్‌లో మీ లిప్స్‌ ఉండాలంటే ఇలా చేయండి!

టీస్పూన్ కొబ్బరి నూనె,వాసెలిన్, విటమిన్-ఇ క్యాప్సూల్, 2 టీస్పూన్లను ఒక గిన్నెలో వేయండి. అందులో బీట్ రూట్ జ్యూస్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ క్రీమ్‌ను వారం రోజుల ఫ్రిడ్జ్‌లో ఉంచి గడ్డ కట్టిన తర్వాత లిప్స్‌ను అప్లై చేసుకుంటే అందమైన పెదాలు మీ సొంతం!

New Update
Lip Care: సాఫ్ట్‌గా, పింక్ కలర్‌లో మీ లిప్స్‌ ఉండాలంటే ఇలా చేయండి!

Lip Care: మనం మన చర్మాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో, పెదవులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అది పొడిబారడం, మొదలవుతుంది. పెదవులు కూడా అలాగే పాడైపోతాయి. లిప్స్‌ను సరిగా మాయిశ్చరైజ్ చేయకపోతే అవి పొడిబారిపోతాయి. ముదురు, పొడి పెదవులకు లిప్ స్టిక్ సెట్‌ కాదు. ముదురు, పొడి పెదాలను మృదువుగా, గులాబీ రంగులోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి!

ఈ రెమెడీ చేయడానికి, మీకు 1 టీస్పూన్ కొబ్బరి నూనె, 1 టీస్పూన్ వాసెలిన్, 1 విటమిన్ ఇ క్యాప్సూల్, 2 టీస్పూన్ల తాజా బీట్రూట్ రసం అవసరం. ముందుగా బీట్ రూట్ ను తురిమి దాని రసాన్ని తీయాలి. తరువాత కొబ్బరి నూనె, వాసెలిన్, విటమిన్-ఇ క్యాప్సూల్స్ ఒక గిన్నెలో వేయండి. ఇప్పుడు అందులో బీట్ రూట్ జ్యూస్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.

లిప్‌బామ్‌ అవసరమే ఉండదు:

  • ఇంట్లో తయారుచేసిన ఈ క్రీమ్ ను ఒక చిన్న గాజు కంటైనర్ లో నింపండి. ఈ బాక్స్ మూత గట్టిగా ఉండేలా చూసుకోండి. ఈ బాక్స్ ను ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల పాటు ఒకసారి తయారుచేసిన ఈ క్రీమ్ ను వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పెదవులకు మంచి పోషణ లభించి మృదువుగా మారుతుంది. అంతేకాక బీట్ రూట్ పెదవులకు మంచి గులాబీ రంగును ఇస్తుంది కాబట్టి మరే ఇతర లిప్ స్టిక్ లేదా లిప్ బామ్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఒంటరితనం, బాధ వెంటాడుతున్నప్పుడు ఏం చేయాలి?

Advertisment
Advertisment
తాజా కథనాలు