Children Massage: పిల్లలకు పదే పదే మసాజ్‌ చేస్తున్నారా?.. జాగ్రత్త

పిల్లలకు మసాజ్ చేయడం వల్ల వారి ఆరోగ్యానికి, అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు, శిశువైద్యులు చెబుతున్నారు. రోజుకు 4,5 సార్లు మసాజ్ చేస్తే శిశువు చర్మంపై అధిక ఒత్తిడిని కలిగించవచ్చు. శిశువుకు ఎన్నిసార్ల మసాజ్‌ చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Children Massage: పిల్లలకు పదే పదే మసాజ్‌ చేస్తున్నారా?.. జాగ్రత్త

Children Massage:పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువగా మసాజ్‌ చేస్తుంటారు. ఇలా పిల్లలకు నాలుగైదుసార్లు మసాజ్ చేయడం నిజంగా సరైనదో కాదో కూడా వారికి తెలియదు. మసాజ్ సరైన ఫ్రీక్వెన్సీ ఎంత అనే విషయం కూడా అవగాహన ఉండదు. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల వారి ఆరోగ్యానికి, అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు, శిశువైద్యులు చెబుతున్నారు.

publive-image

ఇది వారి కండరాలను బలపరుస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని అంటున్నారు. మసాజ్ ఫ్రీక్వెన్సీ శిశువు చర్మం సున్నితత్వంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా పిల్లలకు రోజుకు రెండు నుంచి మూడు సార్లు మసాజ్ చేయడం సరిపోతుంది. రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు మసాజ్ చేయడం అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శిశువు చర్మంపై అధిక ఒత్తిడిని కలిగించవచ్చని చెబుతున్నారు. మసాజ్ పిల్లల కండరాలను బలపరుస్తుంది.

publive-image

మసాజ్‌తో వారి కండరాలు సరిగ్గా పనిచేసి దృఢంగా మారతాయి. పిల్లల శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తం బాగా ప్రవహించడానికి సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీని కారణంగా పిల్లలు మరింత సంతోషంగా, రిలాక్స్‌గా ఉంటారు. ఇది వారి మొత్తం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. మసాజ్ చేసేటప్పుడు సున్నితంగా చేయాలని, పిల్లల చర్మం సున్నితత్వాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, చర్మంపై ఏదైనా ప్రతిచర్య ఉంటే మసాజ్ ఫ్రీక్వెన్సీని తగ్గించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: సూర్యకాంతి నుంచి సన్‌స్క్రీన్‌లు నిజంగా కాపాడతాయా..?

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు