BCCI: బీసీసీఐకి కాసుల పంట.. ఎందుకుంటే.! భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి మరోసారి కాసుల వర్షం కురిసింది. భారత జట్టు సొంత వేదికలపై ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మీడియా హక్కుల కోసం ఈ-వేలం నిర్వహించగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్పోర్డ్ సంస్థ 6000 కోట్లకు మీడియా హక్కులను దక్కించుకుంది. By Karthik 31 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి మరోసారి కాసుల వర్షం కురిసింది. భారత జట్టు సొంత వేదికలపై ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మీడియా హక్కుల కోసం ఈ-వేలం నిర్వహించగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్పోర్డ్ సంస్థ 6000 కోట్లకు మీడియా హక్కులను దక్కించుకుంది. ఈ ఏడాది నుంచి రానున్న 5 సంవత్సరాల పాటు అంటే 2028 వరకు ఈ సంస్థ భారత్‌లో జరిగే మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేయనుంది. కాగా లైవ్ టెలికాస్ట్ కోసం జరిగిన ఈ-వేలం కార్యక్రమంలో వయాకామ్ 18, సోనీ పిక్చర్స్, డిస్నీ స్టార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. కానీ వయాకాబ్ 18 సంస్థ చివరకు 6 వేల కోట్లకు స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల మీడియా ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులను సైతం సొంతం చేసుకుంది. ఈ సంవత్పరం సెప్టెంబర్ 22న సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే మ్యాచ్‌తో వయాకాబ్ 18 తన లైవ్ టెలికాస్ట్‌ను మొదలు పెట్టనుంది. ముకేశ్ అంబానికి చెందిన ఈ సంస్థ స్పోర్డ్స్ 18 ద్వారా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాగా 2012 నుంచి బీసీసీఐ మీడియా హక్కుల పార్ట్‌నర్‌గా స్టార్‌స్టోర్డ్స్ ఉంది. ఈ సంస్థ అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళి మ్యాచ్‌లను సైతం లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. కాగా ఆగస్టు 30న ప్రాంభమైన ఆసియాకప్ అన్ని మ్యాచ్‌లను స్టార్‌స్పోర్డ్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఆసియా కప్‌తో స్వదేశంలో జరుగబోయే పెద్దటోర్నీఅయిన వన్డే వరల్డ్ కప్‌ను సైతం స్టార్‌స్పోర్డ్స్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. మరోవైపు గతంలో ఐపీఎల్ కోసం జరిగిన వేలంలో బీసీసీఐకి కాసులు పంట పండించగా.. ప్రస్తుతం వయాకామ్ సంస్థ ఒప్పందం ద్వారా కూడా బీసీసీఐకి అధిక లాభం చేకూరినట్లైంది. #bcci #2023 #2028 #cash-crop #viacom #organization #6000-crores మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి